ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP GOvt) పర్యావరణ పరిరక్షణకు కీలక అడుగు వేసింది. రాష్ట్ర సచివాలయంలో నేటి నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం విధించింది. ప్లాస్టిక్ కప్పులు, బాటిళ్లు, ప్లేట్ల వాడకంపై నిషేధాన్ని అమలులోకి తెచ్చారు. ఈ చర్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CBN) ఆదేశాల మేరకు చేపట్టారు. వచ్చే ఏడాది జూన్ 5 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం.
Telangana Jagruti: ఎమ్మెల్సీ కవిత కీలక నిర్ణయం.. తక్షణమే అమల్లోకి!
సింగిల్ యూజ్ ప్లాస్టిక్(Single Use Plastic)కు ప్రత్యామ్నాయంగా సచివాలయ ప్రాంగణంలో జూట్ బ్యాగుల స్టాల్‌ను ప్రారంభించారు. ఇది ఉద్యోగులు, సందర్శకులకు ప్లాస్టిక్ వస్తువులకు బదులుగా పర్యావరణ హితమైన వస్తువులను ఉపయోగించుకోవడానికి వీలు కల్పిస్తుంది. ప్లాస్టిక్ నిషేధంతో పర్యావరణాన్ని కాపాడటమే కాకుండా, పర్యావరణ హితమైన వస్తువులను ప్రోత్సహించడం కూడా ఈ చర్యలో భాగమే.
సచివాలయం నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఉందో స్పష్టమవుతోంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు, చివరికి సాధారణ ప్రజలు కూడా ఈ విధానాన్ని అనుసరించి, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని ప్రభుత్వం కోరుతోంది. ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ ఉద్యమానికి ఒక స్ఫూర్తిగా నిలుస్తుందని అధికారులు ఆశిస్తున్నారు.