వైసీపీ (YCP) కి వరుస షాకులు ఎదురవుతూనే ఉన్నాయి. ఎన్నికల్లో ఓటర్లు ఇచ్చిన దెబ్బకు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న (Jagan)..ఇక ఇప్పుడు పార్టీ నేతలు ఇస్తున్న షాకులకు ఏంచేయాలో కూడా అర్ధం కానీ పరిస్థితికి వెళ్లిపోయాడు. ఎన్నికలకు ముందే కాదు ఎన్నికల ఫలితాల తర్వాత కూడా వరుసపెట్టి నేతలు బయటకు వస్తున్నారు. ఈ మధ్య చాలామంది నేతలు వైసీపీ కి రాజీనామా చేసి , టీడీపీ లో చేరగా..తాజాగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivasa Reddy) సైతం వైసీపీ కి రాజీనామా చేసి జనసేన (Janasena) లో చేరేందుకు సిద్ధం అయ్యాడు. ఈరోజు డిప్యూటీ సీఎం , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తో సమావేశమయ్యారు. తాను పార్టీలో చేరతానని అడిగిన వెంటనే ఒప్పుకుని తనను ఆహ్వానించినందుకు ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌కు బాలినేని శ్రీనివాస్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. పవన్ కళ్యాణ్‌తో గంటకు పైగా జరిగిన భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన బాలినేని.. త్వరలోనే ఒంగోలులో ఒక భారీ కార్యక్రమం ఏర్పాటు చేసి.. పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరనున్నట్టు వెల్లడించారు. తనతో పాటు ఒంగోలులోని పలువురు నేతలు కూడా జనసేనలో చేరతారని స్పష్టం చేసారు.
వైసీపీలో జరిగిన అవమానాలకు ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు కూడా ఇంకిపోయాయని అన్నారు. తాను ఏ పదవులు ఆశించడం లేదని.. కేవలం పవన్ కోసం జనసేనలో చేరుతున్నా అని తెలిపారు. జగన్ కోసం నా సొంత ఆస్తులు పోగొట్టుకున్నా. గతంలో ఎన్ని ఇబ్బందులు పెట్టినా వైసీపీని వీడలేదు. ఏ ఒక్క సమావేశంలోనూ జగన్ నా గురించి మంచిగా మాట్లాడలేదు. పదవుల కంటే గౌరవం ముఖ్యం’ అని ఆయన తెలిపారు. ఎన్నికల ముందే జనసేనలో జాయిన్ అవ్వాలి అనుకున్నా, కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కుదరలేదన్నారు. పవన్ ఆదేశాల మేరకు పని చేస్తానన్నారు. కూటమి నేతలతో కలిసి పని చేస్తానని, ఒంగోలులో అందరితో కలిసి ముందుకు వెళ్తానని చెప్పుకొచ్చారు. తాను జగన్‌ను బ్లాక్‌మెయిల్ చేసినట్టు కొన్ని యూట్యూబ్ ఛానళ్లు వార్తలు ప్రసారం చేశాయని అయితే అందులో ఎలాంటి వాస్తవాలు లేవని తెలిపారు.
Read Also : TTD Trade Union President: సీఎం వ్యాఖ్యలు ఉద్యోగులను అవమానపరచడమే: టీటీడీ కార్మిక సంఘాల అధ్యక్షుడు