Balakrishna : హిందూపురంలో బాలకృష్ణ ప్రచారం

MLA Nandamuri Balakrishna:ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం (Hindupuram) నియోజకవర్గంలో ప్రచారం ప్రారంభించారు. ఈ ప్రచారంలో కూటమి నాయకులు కార్యకర్తలు బాలకృష్ణ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన గ్రామాల్లో పర్యటిస్తూ మూడవసారి అవకాశం కల్పిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. సినిమా డైలాగుల చెబుతూ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. సీఎం జగన్ పై విమర్శలు కురిపించారు. We’re now on WhatsApp. Click to Join. కాగా, […]

Published By: HashtagU Telugu Desk
Balakrishna campaign in Hindupur

Balakrishna campaign in Hindupur

MLA Nandamuri Balakrishna:ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం (Hindupuram) నియోజకవర్గంలో ప్రచారం ప్రారంభించారు. ఈ ప్రచారంలో కూటమి నాయకులు కార్యకర్తలు బాలకృష్ణ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన గ్రామాల్లో పర్యటిస్తూ మూడవసారి అవకాశం కల్పిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. సినిమా డైలాగుల చెబుతూ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. సీఎం జగన్ పై విమర్శలు కురిపించారు.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, ఇటివల హిందూపురం టీడీపీ అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ తన నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. హ్యాట్రిక్ విజయం కోసం ఆయన హిందూపూర్ లో ప్రయత్నిస్తున్నారు. భారీ ర్యాలీతో బయలుదేరి నందమూరి బాలకృష్ణ తొలుత సూగూరు ఆంజనేయస్వామి ఆలయంలో నామినేషన్ పత్రాలు ఉంచి పూజలు నిర్వహించారు. పూజలు చేసి… ముందుగా హిందూపురంలోని తన ఇంటి నుంచి కార్యకర్తలతో కలిసి నందమూరి బాలకృష్ణ నామినేషన్‍కు ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. నామినేషన్ బాలకృష్ణ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమానికి హిందూపురంలో టీడీపీ కార్యకర్తలతో పాటు బాలకృష్ణ అభిమానులు పెద్దయెత్తున తరలి వచ్చారు.

Read Also: AP Congress : మరో లిస్ట్ వచ్చేసింది.. 38 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులు వీరే

హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ మూడోసారి నామినేషన్‌ వేశారు. త‌న పేరు మీద రూ. 81 కోట్ల 63 లక్షలు ఉన్న‌ట్లు అఫిడ‌విట్‌లో పేర్కొన్నారు. భార్య వసుంధర పేరు మీద రూ.140 కోట్ల 38 లక్షల 83 వేలు ఉండ‌గా.. బాలయ్యకు రూ. 9 కోట్ల 9 లక్షల 22 వేల అప్పులు ఉన్న‌ట్లు పేర్కొన్నారు.

 

  Last Updated: 22 Apr 2024, 03:09 PM IST