AP : వివేకాహత్య కేసులో భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరు..

అనారోగ్యం కారణంగా తనకు పదిహేను రోజుల పాటు బెయిల్ మంజూరు చేయాలనీ వైఎస్ భాస్కర్ రెడ్డి సీబీఐ కోర్టులో పిటీషన్ వేసుకున్నారు. పదిరోజుల పాటు… దీనిపై విచారించిన సీబీఐ కోర్టు నేడు వైఎస్ భాస్కర్ రెడ్డికి ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసింది

  • Written By:
  • Publish Date - September 20, 2023 / 07:54 PM IST

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు (Viveka Murder Case)లో నిందితుడిగా ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డి(Y S Bhaskar Reddy)కి న్యాయస్థానం బెయిల్ (Bail ) మంజూరు చేసింది. అనారోగ్యం కారణంగా తనకు పదిహేను రోజుల పాటు బెయిల్ మంజూరు చేయాలనీ వైఎస్ భాస్కర్ రెడ్డి సీబీఐ కోర్టు (CBI COurt)లో పిటీషన్ వేసుకున్నారు. పదిరోజుల పాటు… దీనిపై విచారించిన సీబీఐ కోర్టు నేడు వైఎస్ భాస్కర్ రెడ్డికి ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసింది. ఇదే కేసులో మరో నిందితుడు శివశంకర్‌ రెడ్డికి మాత్రం నిరాశ ఎదురైంది. వివేకా హత్య కేసులో A-5 గా ఉన్న శివశంకర్‌ రెడ్డి తనకు బెయిల్ మంజూరు చేయాలని హైదరాబాద్ లోని సీబీఐ కోర్టును ఆశ్రయించారు. శివ శంకర్ రెడ్డి పిటిషన్ విచారించిన న్యాయస్థానం అందుకు నిరాకరించింది.

Read Also : Telangana : విజయశాంతి బిజెపి కి బై..బై చెప్పబోతుందా..?

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు (Viveka Murder Case)లో నిందితుడిగా ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు ఏప్రిల్ 16న అరెస్టు చేశారు. భాస్కర్ రెడ్డి కుమారుడు ఎంపీ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డిని కూడా అప్పుడు అదుపులోకి తీసుకున్నారు. వివేకా హత్య కుట్రకు పాల్పడ్డారని భాస్కర్ రెడ్డి ఫై 120బి రెడ్ విత్ 302, 201 సెక్షన్ల కింద సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. హత్య అనంతరం సాక్ష్యాధారాల ధ్వంసంలో భాస్కర్ రెడ్డి కీలక పాత్ర పోషించారని అభియోగం మోపారు. వివేకా హత్య కేసులో ఒక కుట్రదారుడిగా భాస్కర్ రెడ్డిపై అభియోగాలు మోపారు. వివేకా గుండెపోటుతో మరణించినట్లుగా తొలుత ప్రచారం జరిగిందని, ఆ గుండెపోటు ప్రచారంలో భాస్కర్ రెడ్డి పాత్ర ఉన్నట్లుగా ఆరోపించారు. హత్యకు ముందు భాస్కర్ రెడ్డి ఇంట్లో సునీల్ ఉన్నట్లుగా ఆధారాలు గురించినట్లుగా సీబీఐ అధికారులు అప్పట్లో తెలిపారు.