Site icon HashtagU Telugu

Volunteers : వాలంటీర్ల వ్యవస్థలో మార్పులు చేసేందుకు బాబు ప్లాన్..?

Changes In The Volunteer Sy

Changes In The Volunteer Sy

ఏపీలో జగన్ తీసుకొచ్చిన వాలంటీర్ల వ్యవస్థలో మార్పులు చేసేందుకు చంద్రబాబు చూస్తున్నట్లు తెలుస్తుంది. గత ప్రభుత్వంలో వాలంటీర్లు కీలక బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ అధికారులు చేయాల్సిన పనులన్నీ వాలంటీర్ల చేత చేయించారు జగన్. రోజుకు 12 నుండి 14 ‘గంటలు పనిచేసిన వారికీ జగన్ ఇచ్చిన జీతం నెలకు రూ.5 వేలు మాత్రమే. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం వాలంటీర్లకు రూ. 10 వేలు ఇస్తామని , వాలంటీర్లను తీసివేయమని ఎన్నికల ప్రచారంలో మాట ఇచ్చారు బాబు. ఇచ్చిన మాట ప్రకారం వాలంటీర్లకు నెలకు రూ. 10 వేలు ఇచ్చేందుకు చూస్తున్నట్లు సమాచారం. అయితే వాలంటీర్ల వ్యవస్థలో కొన్ని మార్పులు చేయబోతున్నారట.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా జరుగుతున్న కసరత్తు మేరకు ప్రతీ గ్రామంలో ఐదుగురు మాత్రమే వాలంటరీలు ఉంటారని చెబుతున్నారు. ఇప్పుడున్న 5000 జీతాన్ని పదివేల రూపాయలకు పెంపు దిశగా నిర్ణయం అమలు చేయనున్నారు. దీనికి సంబంధించి కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారట. అలాగే వాలంటీర్ల నియామకంలో డిగ్రీ ఉత్తీర్ణత చెంది 1994నుండి 2003 వరకు వయసు వయోపరిమితి గా నిర్ణయించనున్నట్లు తెలుస్తోంది. గ్రామ పరిధిలోనే కాకుండా మండల పరిధిలో విధులుకు హాజరు అయ్యేలా మార్పులు చేస్తున్నట్లు సమాచారం. వాలంటరీ సచివాలయ సిబ్బంది వ్యవస్థ గ్రామ సర్పంచుల ఆధీనంలో పూర్తి అధికారం ఉండేలా విధి విధానాల రూపకల్పన చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటి వరకు ప్రతీ నెలా వాలంటీర్ ఇంటికి వెళ్లి అందించే పెన్షన్ విషయం పైన పునరాలోచన చేస్తున్నట్లు అధికార వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ప్రతి నెల ఇచ్చే పెన్షన్ దారులకు నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ చేయాలా..ప్రస్తుత విధానం కొనసాగించాలా అనే అంశం పైన ప్రభుత్వం ఏర్పాటు తరువాత తుది నిర్ణయం తీసుకోన్నారు. దీనిపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

Read Also : FISH PRASADAM : 8,9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ.. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు