ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి (AP CM) నారా చంద్రబాబునాయుడు (Chandrababu) రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అరాచకాలకు తగిన శిక్షలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. పాలనను ప్రజల ధ్వంసానికి ఉపయోగించుకున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. పల్నాడు జిల్లాలో జగన్ పర్యటనకు సంబంధించిన అనుమతులు ఉల్లంఘించారని, ప్రజలను రెచ్చగొట్టే కార్యక్రమాలు నిర్వహించారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి దారుణమైన రాజకీయ పద్ధతులు రాష్ట్రంలో ఎప్పుడూ చూడలేదని ఆయన వ్యాఖ్యానించారు.
Life Style : వాకింగ్ చేస్తే హైబీపీ తగ్గి గుండె ఆరోగ్యం మెరుగవుతుందా..? ఈ చిట్కాలు పాటిస్తే చాలు!
వైఎస్సార్సీపీ నేతలు ప్రజలను భయపెడుతున్నారని, రౌడీ ఇజాన్ని ప్రోత్సహిస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. “చంపుతాం” అనే ప్లకార్డులతో ప్రజల్లో భయాన్ని కలిగిస్తున్న వైఎస్సార్సీపీ కార్యకర్తల వ్యవహారాన్ని తీవ్రంగా ఖండించారు. గంజాయి మాఫియా, బెట్టింగ్ గ్యాంగులు, హింసాత్మక గుంపులు హీరోలుగా ప్రదర్శించబడుతున్నాయని, ఇది సమాజానికి అత్యంత ప్రమాదకరమని చెప్పారు. రాజకీయం అంటే ప్రజల కోసం పని చేయడం కావాలని, రాష్ట్రాన్ని నాశనం చేసే కుట్రలను తాను తట్టుకోనని, అవసరమైతే తాట తీసేందుకు వెనకాడనని హెచ్చరించారు.
Life Style : అతిగా జిమ్ చేయడం వలన శరీరానికి ఎంత డ్యామేజ్ జరుగుతుందో తెలుసా!
చనిపోయిన వ్యక్తుల పేరుతో రాజకీయ లబ్ధి పొందాలనుకునే వైఎస్సార్సీపీ నేతల వైఖరిని చంద్రబాబు తిప్పికొట్టారు. ఏడాది క్రితం మరణించిన నాగమల్లేశ్వరరావుకు ఇప్పుడు పరామర్శ ఎందుకని ప్రశ్నించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారు ఉన్నా, వైఎస్సార్సీపీ నేతల కారణంగా పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ తన పర్యటనల ద్వారా దుర్మార్గాల పట్ల ప్రోత్సాహం ఇస్తున్నారని ఆరోపించారు. ప్రజలే అప్రమత్తంగా ఉండి, మంచిని అభివృద్ధిని ఆశించాలనీ, చట్టాన్ని పాటించని నాయకులకు తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని చంద్రబాబు హితవు పలికారు.