Site icon HashtagU Telugu

Chandrababu : ఈ నెల 07 న ఢిల్లీకి బాబు..

TDP

AP CID files fresh case against Chandrababu

టీడీపీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu ) ఈ నెల 07 న ఢిల్లీ (Delhi)కి వెళ్లబోతున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో దాదాపు 52 రోజుల పాటు జైల్లో గడిపిన బాబు..ఈ మధ్యనే రెగ్యులర్ బెయిల్ ఫై బయటకు వచ్చి రాజకీయాల్లో బిజీ అయ్యారు. ప్రస్తుతం దైవ దర్శనాల్లో బిజీ గా ఉన్న బాబు..ఈ నెల 07 న ఢిల్లీకి వెళ్లబోతున్నారు. రాష్ట్రంలో ఓట్ల అక్రమాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయబోతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని ఓట్ల అక్రమాలపై టీడీపీ పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా మరోసారి చంద్రబాబు ఈ ఓటర్ల జాబితాలో అక్రమాలపై ఢిల్లీ వేదికగా పోరాటం చేయాలని నిర్ణయించారు. సీఈసీని కలిసి ఓట్ల అక్రమాలపై ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 10న సీఈసీకి చెందిన బృందం ఏపీకి రానుంది. ఈ నేపథ్యంలో వారు రాష్ట్రానికి రాకముందే సీఈసీని కలిసి ఓట్ల అక్రమాలపై ఫిర్యాదు చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. చంద్రబాబుతో పాటు పలువురు ఎంపీలు సైతం సీఈసీని కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది.

We’re now on WhatsApp. Click to Join.

ఇదిలా ఉంటె ప్రస్తుతం కొనసాగుతున్న తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొనాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మిచౌంగ్ తుపాను ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు..నాయకులు, కార్యకర్తలు అండగా నిలవాలని కోరారు. విస్తృతంగా సహాయక చర్యల్లో పాల్గొనాలని సూచించారు.

Read Also : ఖర్గే నివాసంలో ముగిసిన సమావేశం..కాసేపట్లో సీఎం ఎవరనేది ప్రకటన