Vizag : విశాఖను వాణిజ్య రాజధానిని చేస్తా అంటూ బాబు హామీ..

విశాఖను వైసీపీ గంజాయి, డ్రగ్స్ రాజధానిగా మారిస్తే.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖను వాణిజ్య రాజధానిని చేస్తామని ఉత్తరాంధ్ర ప్రజలకు చంద్రబాబు మాటిచ్చారు

  • Written By:
  • Publish Date - April 15, 2024 / 11:30 PM IST

ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు..ఉత్తరాంధ్ర ప్రజలకు తీపి కబురు తెలిపారు. విశాఖను వాణిజ్య రాజధానిని చేస్తా అంటూ కీలక హామీ ఇచ్చారు చంద్రబాబు. ప్రస్తుతం ఏపీలో ఎన్నికల ప్రచారం ఏ రేంజ్ లో ఉందో చెప్పాల్సిన పనిలేదు. మాటల తూటాలే కాదు రాళ్ల వర్షం కూడా కురుస్తుంది. అధికార – ప్రతిపక్ష నేతల ఫై రాళ్ల దాడి కూడా చేస్తూ ఎన్నికల ప్రచారం అంటే రక్తపాతం జరగాల్సిందే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. అయినప్పటికీ ఎవ్వరు తగ్గడం లేదు. ఎవరికీ వారు వారి వారి స్క్రిప్ట్ లు పట్టుకొని ప్రచారం చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక టీడీపీ విషయానికి వస్తే…అధినేత చంద్రబాబు ఈసారి జగన్ ను గద్దె దించడమే లక్ష్యం గా పెట్టుకున్నారు. తన వయసును సైతం లెక్కచేయకుండా ఎన్నికల ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఈరోజు విజయనగరం జిల్లాలోని రాజాంలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఉత్తరాంధ్రకు కీలక హామీ ఇచ్చారు. విశాఖను వైసీపీ గంజాయి, డ్రగ్స్ రాజధానిగా మారిస్తే.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖను వాణిజ్య రాజధానిని చేస్తామని ఉత్తరాంధ్ర ప్రజలకు చంద్రబాబు మాటిచ్చారు. టీడీపీ హయంలో చేపట్టిన పనులు ఉత్తరాంధ్రలో కొనసాగి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని గుర్తు చేసారు. తమ ప్రభుత్వం ఎంతో కష్టపడి మెడ్ టెక్ పార్కులు, అదానీ డేటా సెంటర్, లులు మాల్, ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్ తీసుకువస్తే.. వైసీపీ వాటన్నింటినీ తరిమి కొట్టిందన్నారు.రాష్ట్రం బాగుకోసమే కూటమి గా ఏర్పడ్డామని..రాబోయే ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాదించబోతుందని ధీమా వ్యక్తం చేసారు.

Read Also : Lok Sabha Elections : ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పొంగులేటి ప్రసాదరెడ్డి