శనివారం టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu ) మొదటి జాబితాను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 94 మందితో కూడిన జాబితాను (TDP List) రిలీజ్ చేసి ఎన్నికల సమరం మొదలుపెట్టారు. తాజాగా టికెట్ దక్కించుకున్న నేతలకు (TDP Candidates) ఫోన్లు చేసి దిశానిర్దేశం చేశారట. ఈ 40 రోజులు చాల కీలకమని, ప్రతి ఒక్కరు ఈ 40 రోజుల్లో ప్రజల్లో ఉండాలని సూచించారట. గెలుస్తామనే ధీమాతో నిర్లక్ష్యం చేయకూడదని , ప్రతి వారం సర్వేలు చేస్తామని , సర్వేలో ఏమాత్రం తేడా కొట్టిన మరొకరు మీ స్థానాల్లో ఉంటారని హెచ్చరించారట. జనసేన కేడర్ ను కలుపుకొని ఎన్నికల ప్రచారం కొనసాగించాలని నిర్దేశించారు. అలాగే టికెట్ దక్కని నేతలను బుజ్జగించే ప్రయత్నాలు మొదలుపెట్టారట.
We’re now on WhatsApp. Click to Join.
‘పార్టీ అభ్యర్థలును కొత్త విధానం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేశాం. ఇందుకోసం 1.3 కోట్ల మంది నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నాం. అలాగే సర్వేలు పరిశీలించి సుదీర్ఘ కసరత్తు చేసి అభ్యర్థుల ఎంపిక చేశాం. గతంలో ఎప్పుడూ ఇంత ముందుగా అభ్యర్థుల ప్రకటన జరగలేదు. రాష్ట్ర ప్రయోజనాలే ప్రధానంగా.. గెలుపే లక్ష్యంగా ఎంపిక జరిగింది. 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్ కోసమే టీడీపీ-జనసేన పొత్తు’’.
‘‘ఏ పార్టీలో కూడా ఎప్పుడూ ఇటువంటి ప్రయత్నం జరగలేదు. ఇక ఇప్పుడు ఒక్క సీటూ ఓడిపోవడానికి వీలు లేదు. ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్‌కు ఎంతో కీలకం. ఏ స్థాయిలో కూడా చిన్న తప్పు, పొరపాటు జరగకూడదు. వచ్చే 40 రోజులు అత్యంత కీలకం.. కాబట్టటి నిత్యం ప్రజల్లో ఉండాలి. ప్రజలకు భవిష్యత్‌పై నమ్మకం కలిగేలా నాయకత్వం అందించాలి. ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించాం.. ఇప్పుడు 99 చోట్ల ఉమ్మడి అభ్యర్థులనూ ప్రకటించాం. జగన్ అహంకారంతో చేసిన విధ్వంసం అతని పతనానికి నాంది అవుతుంది. చరిత్రలో చూడని విధ్వంస పాలకుడైన జగన్‌ను.. ఓడించేందుకు జనం సిద్ధంగా ఉన్నారు. ప్రజలతో ఓట్లు వేయించుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది’ అని చంద్రబాబు అభ్యర్థులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు.
Read Also : New York : అమెరికాలో భారత యువ జర్నలిస్ట్ మృతి..