CBN Is Back : బాబు వచ్చాడు…CID చీఫ్ సంజయ్ పరిస్థితి ఎలా ఉంటుందో..?

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో అక్రమాలు జరిగాయని, అందులో చంద్రబాబు ప్రమేయం ఉందంటూ ప్రభుత్వం ఆయన్ను అరెస్టు చేసింది

  • Written By:
  • Publish Date - June 5, 2024 / 12:22 PM IST

ఏపీ సీఎం గా చంద్రబాబు (Chandrababu) మరో మూడు రోజుల్లో బాధ్యతలు చేపట్టబోతున్నారు. బాధ్యత చేపట్టగానే రాష్ట్రాన్ని గాడిన పెట్టడమే కాదు తనపై , అలాగే టీడీపీ శ్రేణుల ఫై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందికి గురి చేసిన వారి పని పట్టడం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే లోకేష్ తో పాటు చాలామంది టీడీపీ సీనియర్ నేతలు పలు శాఖల వారికీ హెచ్చరిక లు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చంద్రబాబు ఫై అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టడం , కనీసం బెయిల్ రాకుండా ఇబ్బంది చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని అర్ధం అవుతుంది.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో అక్రమాలు జరిగాయని, అందులో చంద్రబాబు ప్రమేయం ఉందంటూ ప్రభుత్వం ఆయన్ను అరెస్టు చేసింది. ని‌‍ధుల దుర్వినియోగం, దారిమళ్లింపు, తప్పుడు నివేదికలు, ప్రభుత్వ నిబం‌ధనల నుంచి పక్కకు జరగడం వంటివి జరిగిందని ఆరోపిస్తూ చంద్రబాబును అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలులో నిర్బంధించారు. ఈ కేసులో AP CID Chief సంజయ్ పాత్ర ఎంత ఉందొ తెలియంది కాదు. జగన్‌ చెప్పినదే చట్టమంటూ అధికారాన్ని చెలాయించి ఇష్టానుసారం కేసులు పెట్టి బాబు ను తీవ్ర ఇబ్బందికి గురి పెట్టారు. ఇక ఇప్పుడు చంద్రబాబు టైం రావడం తో తన పని అయిపోయినట్లే అని సంజయ్ భావిస్తూ ముందుగానే దేశం వదిలి వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నాడు.

We’re now on WhatsApp. Click to Join.

తప్పుడు కేసుల నమోదులో కీలకంగా వ్యవహరించిన ఆయన బుధవారం నుంచి నెల రోజుల పాటు సెలవు కావాలంటూ ఆంధ్రప్రదేశ్‌ సీఎస్‌కు అర్జీ పెట్టుకున్నారు. అచ్చం సంజయ్‌లానే వ్యవహరించిన సీఎస్‌ ఆయనకు నెల రోజులు సెలువు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పేరుకు వ్యక్తిగత కారణాలతో అమెరికా పర్యటన వెళ్లేందుకంటూ ఆయన దరఖాస్తు చేసుకున్నాడు. ఇంత కాలం సంజయ్‌ వ్యవహారశైలిపై ఆగ్రహంతో ఉన్న కూటమి కార్యకర్తలు ఆయన సెలువు పెట్టడంపై సోషల్‌ మీడియాలో విస్తృతంగా ట్రోల్‌ చేస్తున్నారు. కూటమి అధికారంలోకి రావడంతో భయపడి సెలువు పెట్టారంటూ మీమ్స్‌, ట్వీట్స్‌ చేస్తూ కామెంట్స్‌ చేస్తున్నారు. లోకేశ్‌ రెడ్‌ బుక్‌లో సంజయ్‌ పేరుందని, సంజయ్‌కు అస్సామ్‌ ఖామంటూ ట్రోల్స్‌ చేస్తున్నారు. సంజయ్‌ను అరెస్టు చేసి విచారిస్తే జగన్‌ పాలనలో జరిగిన కుంభకోణాలు అన్నీ బయటకు వస్తాంటూ మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మరి కూటమి ప్రభుత్వం సంజయ్ ని ఏంచేస్తుందో చూడాలి.

Read Also : YS Sharmila Wishes: చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌ల‌కు శుభాకాంక్ష‌లు తెల‌పిన వైఎస్ ష‌ర్మిల‌