TDP-Janasena-BJP : బిజెపి కి 10 అసెంబ్లీ , 3 ఎంపీ సీట్ల ఇచ్చేందుకు బాబు ఫిక్స్..?

  • Written By:
  • Publish Date - February 8, 2024 / 11:52 AM IST

ఏపీలో బిజెపి-టిడిపి-జనసేన పొత్తు ఫిక్స్ అయ్యినట్లేనా..? అంటే అవుననే అవుననే చెప్పాలి. మరో రెండు నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధం అవుతూ..పొత్తులను ఫిక్స్ చేసుకుంటున్నాయి. ఇప్పటీ జనసేన – టిడిపి పొత్తు ఫిక్స్ కాగా..ఇప్పుడు బిజెపి కూడా టిడిపి -జనసేన తో పొత్తు పెట్టుకొని ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధం అయ్యింది. ఇప్పటీకే టిడిపి అధినేత చంద్రబాబు నిన్న ఢిల్లీకి వెళ్లగా..మరికాసేపట్లో జనసేన అధినేత పవన్ సైతం ఢిల్లీకి వెళ్ళబోతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

బిజెపి నుంచి సీట్ల డిమాండ్ భారీగా ఉండడం తో.. చంద్రబాబు ఢిల్లీకి వెళ్లే ముందే పార్టీ ముఖ్యులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. అందరి అభిప్రాయాలను సేకరించారు. పొత్తు ఉభయతారకంగా ఉంటేనే సమ్మతించాలని పార్టీ నేతలు చంద్రబాబుకు సూచించినట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లో బిజెపి ఏకపక్ష డిమాండ్ కు ఒప్పుకోవద్దని చంద్రబాబు వద్ద సీనియర్లు ప్రస్తావించడం జరిగింది. 2009లో బిజెపికి శక్తికి మించి ఇచ్చిన సీట్ల విషయాన్ని సీనియర్లు గుర్తు చేశారు. ఇప్పటికే జనసేనతో పొత్తు కారణంగా 25 నుంచి 30 అసెంబ్లీ స్థానాలు వదులుకోవాల్సిన విషయాన్ని ప్రస్తావించారు. ఒకవేళ బిజెపి కోరిన విధంగా అధిక స్థానాలు కేటాయిస్తే పార్టీలో ఒక రకమైన వ్యతిరేకత వస్తుందని నేతలకు బాబు కు తెలియజేసారు. బిజెపికి మూడు ఎంపీ, పది అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు పార్టీ నేతలు సూత్రప్రాయంగా అంగీకరించారు. కానీ బిజెపి మాత్రం 25 అసెంబ్లీ స్థానాలు, 6 నుంచి 8 ఎంపీ స్థానాలు అడుగుతున్నట్లు సమాచారం. అందుకే చంద్రబాబు తో పాటు పవన్ కళ్యాణ్ ను కూడా హస్తినకు పిలిపించుకొని చర్చలు జరుపుతున్నారు.

ఇక ఈ మూడు పార్టీల పొత్తు ఫిక్స్ అయినట్లే అని తెలియడం తో వైసీపీ నేతలు తమ విమర్శలకు మరింత పదును పెడుతున్నారు. 2019 లో బిజెపి తో పొత్తు అని బయటకు వచ్చిన బాబు..ఎప్పుడు ఏ మొఖం పెట్టుకొని పొత్తు పెట్టుకున్నారని ప్రశ్నిస్తున్నారు. కేంద్రం లో ఉన్న బిజెపి , రాష్ట్రానికి ఏ మేలు చేసారని వారితో పొత్తు అని..పొత్తు లేనిది ఎన్నికల్లో నిలిచే ధైర్యం చేయడం లేదని విమర్శలు , ఆరోపణలు చేస్తున్నారు.

Read Also : Jamun Leaves: నేరేడు ఆకుల వల్ల కలిగే రహస్యం గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే?