Site icon HashtagU Telugu

ఉద్యోగస్తులంతా కూటమికి ఓటు వేయాలంటూ కోరిన బాబు ..

Cbn Kothapeta

Cbn Kothapeta

రేపటి నుండి రేపే పోస్టల్ బ్యాలెట్లు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు.. ఉద్యోగస్తులందరు కూటమికి ఓటు వేయాలని కోరారు. ఉద్యోగస్తులను ఈ జగన్ ఎంతగా ఇబ్బందులకు గురిచేసాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..మీకే అన్ని గుర్తున్నాయి..వాటిన్నిటిని గుర్తు పెట్టుకొని కూటమికి ఓటు వెయ్యండి.. 95 శాతం, వీలైతే 100 శాతం టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించాలని బాబు కోరారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ జగన్ డబ్బులతో, కుట్రలతో రాజకీయం చేయాలనుకుంటున్నారు. అతను ఖర్చు పెట్టే డబ్బులు మీవే. జే బ్రాండ్ మద్యం ద్వారా వచ్చిన డబ్బులే, ఇసుక మాఫియా, భూ మాఫియాలో వచ్చిన డబ్బులే. ఈ జలగ జగనన్న మీకిచ్చేది రూ.10… మీ దగ్గర కొట్టేసింది రూ.100… దోచింది రూ.1000 .. ఆస్తి మీది… దాని మీద ఫొటో సైకోది. ప్రజల ఆస్తులు కొట్టేయడానికి సిద్ధపడ్డాడు అని బాబు చెప్పుకొచ్చారు. ఈ యువతకు బంగారు భవిష్యత్ చూపించడం నా బాధ్యత, పవన్ కల్యాణ్ బాధ్యత. ఇవాళ జనసేన కండువా, ఇటు టీడీపీ జెండాల ఊపు చూస్తుంటే…160కి పైబడి అసెంబ్లీ స్థానాలు , 25 లోక్ సభ స్థానాలకు 24 కూటమి కొట్టబోతున్నామని ధీమా వ్యక్తం చేసారు.

కూటమి అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీపై తొలి సంతకం పెడతానని హామీ ఇచ్చారు. రెండో సంతకం ల్యాండ్‌ గ్రాబింగ్‌ చట్టం రద్దుపై చేస్తానని తెలిపారు. ముస్లింలకు ప్రత్యేక బడ్జెట్‌ తీసుకొస్తామని వారి కోసం హజ్‌హౌస్‌ నిర్మిస్తామని అన్నారు. ముస్లిం సోదరులకు మక్కా యాత్రలకు రూ.లక్ష ఆర్థిక సాయం చేస్తామని తెలిపారు. మౌజమ్‌, ఇమామ్‌లకు గౌరవ వేతనం పెంచుతామని ఐదేళ్లలో యుతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

Read Also : Lok Polls : సింగరేణిని ముంచేందుకు రేవంత్ కుట్రలు – కేసీఆర్