Baahubali Sketch : తెలంగాణ‌లో జ‌గ‌న్ స‌భ‌లు? అన్న‌ద‌మ్ముల అనుబంధం!

తెలంగాణ రాజ‌కీయాల్లోకి ఎంపీ సీఎం ఎంట్రీ (Baahubali Sketch) ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే ష‌ర్మిల తెలంగాణ వ్యాప్తంగా పాద‌యాత్ర చేస్తున్నారు.

  • Written By:
  • Updated On - December 23, 2022 / 04:35 PM IST

ఎంపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తెలంగాణ రాజ‌కీయాల్లోకి ఎంట్రీ (YCP In Telangana) ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. రాబోవు రోజుల్లో చంద్ర‌బాబు తెలంగాణ స‌భ‌ల‌కు వ‌చ్చే పాజిటివ్ స్పంద‌న‌ను అధ్య‌యనం చేసిన త‌రువాత రంగంలోకి దిగ‌డానికి ప్లాన్ చేస్తున్న‌ట్టు తాడేప‌ల్లి వ‌ర్గాల్లోని అంత‌ర్గ‌త చ‌ర్చ‌. ఇప్ప‌టికే ష‌ర్మిల తెలంగాణ వ్యాప్తంగా పాద‌యాత్ర చేస్తూ హ‌ల్ చ‌ల్ చేస్తున్నారు. తెలంగాణ కోడలిగా ఫోక‌స్ అయ్యారు. అన్నా, చెల్లెల‌కు ప‌డ‌క‌పోవ‌డంతో కొత్త పార్టీని ఆమె తెలంగాణ రాష్ట్రంలో పెట్టార‌ని అప్ప‌ట్లో అనుకున్నారు. కానీ, ముందుచూపుతో వేసిన స్కెచ్ గా ఇప్పుడిప్పుడే బ‌య‌ట మాట్లాడుకుంటున్నారు. ఇదంతా కేసీఆర్, జ‌గ‌న్ వేసిన `బాహుబ‌లి స్కెచ్` (Baahubali Sketch) గా భావించ‌డానికి ప్ర‌స్తుత రాజ‌కీయాలు ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తున్నాయి.

రాష్ట్రాల‌ను మ‌ళ్లీ క‌లిపితే..(Baahubali Sketch)

ఎలాంటి స‌మ‌యం, సంద‌ర్భం లేకుండా రెండు రాష్ట్రాల‌ను మ‌ళ్లీ క‌లిపితే మంచిద‌ని వైసీపీ స్లోగ‌న్ (YCP In Telangana)  అందుకుంది. స‌మైక్యానికి క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని ఏపీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌క్రిష్ణారెడ్డి బాహాటంగా చెప్పారు. అందుకు ప్ర‌తిగా బీఆర్ఎస్ రంగంలోకి దిగింది. రెండు రాష్ట్రాల‌ను మ‌ళ్లీ క‌ల‌ప‌డానికి ప్లాన్ చేస్తున్నారంటూ రాజ‌కీయ కోణాన్ని ర‌గిలించారు. అంతేకాదు, ఇప్ప‌టి వ‌ర‌కు మౌనంగా ఉన్న ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇటీవ‌ల విభ‌జ‌న చ‌ట్టంలోని 9, 10 షెడ్యూల్ ఆస్తుల‌కు సంబంధించిన పిటిష‌న్ ను సుప్రీం కోర్టులో వేశారు. దాన్ని మరింత ఫోక‌స్ చేసేలా ఎన్నిక‌ల నాటికి ప్లాన్ చేస్తున్నార‌ని వినికిడి. అంటే, సెంటిమెంట్ ను ఈసారి కూడా పెద్ద ఎత్తున ర‌గ‌ల్చ‌డం ద్వారా బీఆర్ఎస్ గ‌ట్టెక్కాల‌ని ప్ర‌య‌త్నం చేస్తోంది. అందుకు వైసీపీ స‌హాకారం అందిస్తూ 2019 ఎన్నిక‌ల రుణాన్ని తీర్చుకోవ‌డానికి ముందుగా ష‌ర్మిల‌ను తెలంగాణ‌కు పంపార‌ని టాక్‌.

కాంగ్రెస్ ఓటు బ్యాంకును..

కాంగ్రెస్ ఓటు బ్యాంకును నిట్ట‌నిలువునా చీల్చ‌డానికి ష‌ర్మిల ను ముందుగా తెలంగాణ బ‌రిలోకి వ్యూహాత్మ‌కంగా దింపార‌ని అనుమానించే వాళ్లు లేక‌పోలేదు. క్రిస్టియ‌న్ ఓటు బ్యాంకు ఎక్కువ‌గా కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. అలాగే రెడ్డి సామాజిక వ‌ర్గం ఓట్లు కూడా ఎక్కువ‌గా అటు వైపు ప‌డే అవ‌కాశం ఉంది. మ‌త‌, కుల ఈక్వేష‌న్ ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఉండే ఓటు బ్యాంకును కొల్ల‌గొట్ట‌డానికి జ‌గ‌న‌న్న బాణం తెలంగాణ‌లోకి ఎంట్రీ ఇవ్వ‌డం వ్యూహాత్మ‌క‌మేన‌ని తొలి నుంచి కాంగ్రెస్ వాదులు అనుమానిస్తున్నారు. ఇప్పుడు సెంటిమెంట్ ను కూడా రేకెత్తించ‌డం ద్వారా చంద్ర‌బాబు స‌భ‌ల‌కు వ‌స్తోన్న ఆద‌ర‌ణ‌ను నిట్ట‌నిలువునా చీల్చేయ‌డానికి పనికొస్తుంది. అందుకే, చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా రెండు రాష్ట్రాలు మ‌ళ్లీ క‌లిసే ప్ర‌స‌క్తే లేద‌ని ఖ‌మ్మం వేదిక‌గా కుండ‌బ‌ద్ధ‌లు కొట్టారు. సుప్రీం కోర్టులో విభ‌జ‌న చ‌ట్టం ఆమోదించిన తీరుపై పార్ల‌మెంట్ ను త‌ప్పుబ‌ట్టిన‌ప్ప‌టికీ మ‌ళ్లీ రెండు రాష్ట్రాల‌ను క‌ల‌ప‌డం సాధ్యంకాద‌ని తేల్చేశారు. అంతేకాదు, ఆ వ్యాఖ్య‌ల వెనుక ఉన్న కుట్ర‌ల‌ను గ‌మ‌నించాల‌ని ప్ర‌జ‌ల్ని అప్ర‌మ‌త్తం చేశారు.

రాబోవు రోజుల్లో ఖ‌మ్మం త‌ర‌హా స‌భ‌ల‌ను తెలంగాణ వ్యాప్తంగా పెట్ట‌డానికి టీడీపీ సిద్ధం అవుతోంది. నిజామాబాద్‌, మ‌హ‌బూబ్ న‌గ‌ర్, గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప్రాంతాల్లో బ‌హిరంగ స‌భ‌ల‌ను నిర్వ‌హిస్తామ‌ని టీటీడీపీ అధ్య‌క్షుడు కాసాని జ్ఞానేశ్వ‌ర్ వెల్ల‌డించారు. ఫ‌లితంగా సెటిల‌ర్ల ఓట్లు పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ కోల్పోయే ప్ర‌మాదం ఉంది. ఒక వేళ అదే జ‌రిగితే, గ్రేట‌ర్ హైద‌రాబాద్ త‌ర‌హా ఫ‌లితాల కంటే దారుణ ఫ‌లితాల‌ను బీఆర్ఎస్ చ‌విచూడాల్సి వ‌స్తోంది. ఎందుకంటే, నార్త్ ఓట‌ర్లు ఎక్కువ‌గా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నారు. ఆ ఓటు బ్యాంకు ఎక్కువ‌గా బీజేపీ వైపు ఉంటుంది. అందుకే, గ్రేట‌ర్ లో ఏ మాత్రం త‌గ్గ‌కుండా టీఆర్ఎస్ పార్టీతో ఇంచుమించు స‌మానంగా కార్పొరేట‌ర్ల‌ను బీజేపీ గెలుచుకోగ‌లిగింది. సెటిల‌ర్లు ఎక్కువ‌గా ఉండే ప్రాంతాల్లో మాత్ర‌మే టీఆర్ ఎస్ కార్పొరేట‌ర్లు ఎక్కువ‌గా గెలిచారు. అందుకే, ఏపీకి చెందిన సెటిల‌ర్ల‌ను కాపాడుకోవ‌డానికి బీఆర్ఎస్ ప‌లు ప్ర‌యత్నాల‌ను చేస్తోంది.

చంద్ర‌బాబు బ‌హిరంగ స‌భ‌లు తెలంగాణ వ్యాప్తంగా

ఖ‌మ్మం త‌ర‌హాలో చంద్ర‌బాబు బ‌హిరంగ స‌భ‌లు తెలంగాణ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిందే, భారీగా సెటిల‌ర్లు టీడీపీ వైపు మొగ్గే అవ‌కాశం ఉంది. సెంటిమెంట్ ను రెచ్చ‌గొట్ట‌డానికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని తెలంగాణ ఎన్నిక‌ల ప్ర‌చారంలోకి దింపాల‌నే ప్లాన్ జ‌రుగుతుంద‌ని అత్యంత విశ్వ‌స‌నీయ స‌మాచారం. ఒక వైపు తెలంగాణ ఓట్ల‌ను ప‌దిలంగా ఉంచుకోవ‌డం, మ‌రో వైపు సెటిల‌ర్ల ఓట్ల‌ను చీల్చ‌డం ద్వారా మూడోసారి సీఎం కావాల‌ని కేసీఆర్ వేస్తోన్న మాస్ట‌ర్ స్కెచ్ గా తెలుగు రాష్ట్రాల్లోని తాజా చ‌ర్చ‌. ఇంకోవైపు ష‌ర్మిల ద్వారా కులం, మ‌త ప్రాతిప‌దిక‌ను ఓట్లు గంప‌గుత్త‌గా కాంగ్రెస్ కు ప‌డ‌కుండా చీల్చ‌డం ద్వారా బీఆర్ఎస్ లాభ ప‌డాల‌ని `బాహుబ‌లి`ని (Baahubali Sketch )మించిన ప్లాన్ వేశార‌ని వినికిడి. సో..చంద్ర‌బాబు స‌భ‌ల‌కు పోటీగా త్వ‌ర‌లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌భ‌ల‌ను కూడా తెలంగాణాలో చూసే ఛాన్స్ ఉంద‌న్నమాట‌. తెలంగాణ కోడ‌లు, అన్న‌ద‌మ్ముల్లాంటి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, కేసీఆర్ ఎలా చంద్ర‌బాబు క్రేజ్ ను త‌గ్గించ‌గ‌ల‌రా? అనేది చూడాలి!

Also Read : YCP MLA: వైసీపీ ఎమ్మెల్యేకు తప్పిన పెను ప్రమాదం