Ayyannapatrudu: పెన్షన్లపై ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు (Ayyannapatrudu) సంచలన కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో తప్పుడు వయసుతో 3 లక్షల 20 వేల మంది దొంగ పెన్షన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. అది చాలా అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ పెన్షన్లు తీసివేస్తే ఓట్లు వేయమని అంటున్నారని, తనకు ఓట్లు వేసినా వేయకపోయినా ఫర్వాలేదన్నారు. పెన్షన్ల విషయంలో ఇంతే మాట్లాడతానని, ఎవరేమనుకున్నా పట్టించుకోనని చెప్పారు.
అనకాపల్లి జిల్లా నాతవరం మండలం మర్రిపాలెం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా గత మూడు రోజులుగా దొంగ పెన్షన్లపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. రాష్ట్రంలో మూడు లక్షల 20వేల మంది దొంగ పెన్షన్లు తీసుకుంటున్నారని తేలింది. తప్పుడు వయసు ధ్రువపత్రాలు సృష్టించి దొంగ పెన్షన్లు తీసుకుంటున్న విషయం బయటపడింది. ప్రతినెల మనిషి ఒక్కొక్కరికి పెన్షన్ రూపంలో 4వేలు రూపాయలను మంజూరు చేస్తున్నాం. దొంగ పెన్షన్లు కారణంగా నెలకు పెన్షన్లు రూపంలో రూ. 120 కోట్లు ప్రభుత్వానికి నష్టం చేకూరుతుందన్నారు.
Also Read: Malavika Mohanan : గ్రాజియా కవర్ పేజ్ పై రాజా సాబ్ బ్యూటీ..!
అలాగే ఆయన ఇంకా మాట్లాడుతూ.. సంవత్సరానికి రూ. 1440 కోట్లు, ఐదు సంవత్సరాలకు రూ. 7200 కోట్లు ప్రభుత్వానికి నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు. ఇదే సొమ్ముతో మూడు తాండవ రిజర్వాయర్లు నిర్మించుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. దొంగ పెన్షన్ తీసుకుంటున్న వారందరూ… దొంగలే అని అంటాను. దొంగ పెన్షన్లపై సీఎం చంద్రబాబు నాయుడు కూడా చెప్పాను…చూద్దాం అని అన్నారు. ఇక్కడ చెప్పొచ్చో లేదో అంటూనే… ఎవరేమనుకున్నా లెక్క చేయనంటూ తన పాత తరహా పందాలోనే నా స్టైలే వేరు అంటూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రసంగించారు.
పింఛన్లు కోత
కూటమి ప్రభుత్వం వచ్చాక ఏపీలో పింఛన్ల సంఖ్య తగ్గిపోతోంది. కూటమి సర్కారు మరో 3 లక్షల పెన్షన్ల తొలగింపుపై గురి పెట్టినట్లు ఆందోళన వ్యక్తమవుతోంది. పైలెట్ సర్వే పేరుతో 10,958మందిని తనిఖీ చేసి 563మందిపై.. అంటే దాదాపు 5శాతం మందిపై అనర్హులుగా ముద్ర వేసింది. రాష్ట్రంలోని మొత్తం పెన్షన్లను తనిఖీ చేసి అందులో 5శాతం.. అంటే దాదాపు 3లక్షలకుపైగా పింఛన్లను తొలగించనుందని సమాచారం.