Jagan Birthday : ‘ఇదే చివరి బర్త్‌డే’ జగన్ అంటూ అయ్యన్నబర్త్ డే విషెష్

ఏపీ సీఎం , వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి (Jagan Birthday) బర్త్ డే ఈరోజు. ఈ సందర్బంగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు జగన్ కు బర్త్ డే విషెష్ అందజేస్తూ వస్తున్నారు. ప్రధాని మోడీ (Modi) , మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇలా ప్రతి ఒక్కరు సోషల్ మీడియా వేదికగా జగన్ కు బర్త్ డే విషెష్ తెలియపరిచారు. ఈ తరుణంలో […]

Published By: HashtagU Telugu Desk
Ayanna Jagan

Ayanna Jagan

ఏపీ సీఎం , వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి (Jagan Birthday) బర్త్ డే ఈరోజు. ఈ సందర్బంగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు జగన్ కు బర్త్ డే విషెష్ అందజేస్తూ వస్తున్నారు. ప్రధాని మోడీ (Modi) , మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇలా ప్రతి ఒక్కరు సోషల్ మీడియా వేదికగా జగన్ కు బర్త్ డే విషెష్ తెలియపరిచారు. ఈ తరుణంలో టీడీపీ సీనియర్ నేత , మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు (Ayyanna Patrudu) సైతం తనదైన శైలి లో జగన్ కు విషెష్ అందించారు.

We’re now on WhatsApp. Click to Join.

‘‘సీఎం వైఎస్ జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు. మీకు ఆయురారోగ్యాలు కలగాలి. అయితే సీఎం హోదాలో మీకు ఇదే చివరి బర్త్‌డే అవుతుంది. ఎందుకంటే మీరు మూడు నాలుగు నెలల్లో మాజీ సీఎం అవ్వబోతున్నారు. ఈ విషయం మీకూ పూర్తిగా అర్ధం అయినట్లు ఉంది. అందుకే ఒక్కరోజులో మీ పుట్టినరోజు ప్రకటనల పేరుతో సొంత పత్రిక కోసం రూ.100 కోట్లు కొల్లగొట్టారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ శాఖల నుంచి కోట్లు కుమ్మరించి శుభాకాంక్షలకు ప్రకటనలా? ప్రైవేటు సంస్థలను బెదిరించి మరీ యాడ్స్ పేరుతో వసూలు చేస్తారా? పుట్టిన రోజు నాడూ అబద్ధాలు చెప్పడమే మీ నైజమా? బర్త్‌డే పేరుతో ఒక్క రోజులో రూ.100 కోట్లు కొట్టేసిన ఏకైక సీఎం మీరే. పుట్టిన రోజును కూడా ఆర్థిక ఉగ్రవాదానికి వేదికగా చేకుంటారు కాబట్టే.. ముఖ్యమంత్రిగా మీకు ఇది చివరి పుట్టిన రోజు అవుతుంది. అక్రమ పద్ధతిలో, అధికారిక దోపిడీలో మీకు మీరే సాటి. రాష్ట్రం మాత్రం లూటీ’’ అంటూ అయ్యన్న విషెష్ తెలిపారు.

అలాగే అచ్చెన్నాయుడు సైతం జగన్ బర్త్ డే వేడుకలపై ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రజాధనంతో వేడుకలు చేసుకోవడం జగన్‌రెడ్డి రాచరిక పోకడలకు నిదర్శనం. ముఖ్యమంత్రిగా ఏం సాధించారని జగన్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్నారని అచ్చెన్నాయుడు అన్నారు.

Read Also : Chandrababu : పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపిన చంద్రబాబు

  Last Updated: 21 Dec 2023, 03:53 PM IST