Aurobindo : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని 108 అంబులెన్సులు, 104 వాహన సర్వీసులను అరబిందో సంస్థ నిర్వహిస్తోంది. అయితే ఇక ఆ సర్వీసులను తాము నిర్వహించలేమని ఇటీవలే అరబిందో ప్రకటించింది. ఈమేరకు ఎన్టీఆర్ వైద్య సేవల ట్రస్ట్ సీఈవోకు లేఖ రాసింది. తమ స్థానంలో జీవీ కంపెనీ, యునైటెడ్ బి హెల్త్‌కేర్ సంస్థలకు సబ్ కాంట్రాక్టు ఇవ్వాలని సూచించింది. దీన్నిబట్టి ఆ సంస్థ 108, 104 వైద్య వాహన సర్వీసుల నుంచి వైదొలగబోతోందనే విషయం స్పష్టమైంది. సరిగ్గా సేవలను అందించలేకపోతే ఏ సంస్థ అయినా తప్పుకుంటుంది. కానీ అరబిందో(Aurobindo) ఇందుకు భిన్నంగా.. తమకు బదులుగా ఎవరికి సబ్ కాంట్రాక్ట్ ఇవ్వాలనేది కూడా సిఫార్సు చేయడం వివాదాస్పదంగా మారింది. దీనిపై ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Also Read :IPL 2025 Auction: ఐపీఎల్ మెగా వేలం జరిగేది ఎక్కడో తెలుసా? ఇండియాలో అయితే కాదు!
ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో 108, 104 వైద్య వాహన సర్వీసులు చాలా కీలకమైనవి. 2027 వరకు ఈ సర్వీసులను నిర్వహించేందుకు అరబిందో సంస్థతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అరబిందో గ్రూపు సంస్థల్లో వైఎస్సార్ సీపీ నేత విజయసాయిరెడ్డి అల్లుడు కీలకంగా వ్యవహరిస్తున్నారనే కథనాలు వస్తున్నాయి. ఇప్పుడు ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడంతో లెక్క మారిపోయింది. అరబిందో స్థానంలో వేరే సంస్థకు 108, 104 సర్వీసులను అప్పగించేందుకు త్వరలోనే టెండర్లు పిలుస్తారని సమాచారం.
Also Read :Kajal : కాజల్ కి అన్యాయం చేస్తున్న టాలీవుడ్..!
ఏపీలోని 108, 104 సర్వీసుల్లో పనిచేసే ఉద్యోగులకు సకాలంలో వేతనాలు అందడం లేదు. 104 పథకం కింద గ్రామీణులకు అందించే మందుల విషయంలోనూ అవకతవకలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. ఏపీలో ఈ రెండు సర్వీసుల పరిధిలో మొత్తం 768 అంబులెన్సులు నడుస్తున్నాయి. 2019-24 మధ్యకాలంలో ఈ రెండు సర్వీసుల కోసం రూ.450 కోట్లతో కొత్త వాహనాల్ని కొన్నారు.