Abbaya Chowdary : దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కారు డ్రైవర్ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. ఎమ్మెల్యే కారును అడ్డుకోవడం, దౌర్జన్యం, బెదిరింపులకు పాల్పడడం తదితర అభియోగాల కింద ఆయనపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. బుధవారం రాత్రి ఓ మ్యారేజ్ ఫంక్లన్లో జరిగిన వివాదం ఈ కేసుకు దారితీసినట్లు తెలుస్తోంది.
Read Also: JioHotstar Plans: జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లు ఇవే.. రూ. 149 నుంచి ప్రారంభం!
బుధవారం రాత్రి ఏలూరు శివారులోని ఓ గ్రామంలో జరిగిన వివాహ వేడుకకు ఎమ్మెల్యే చింతమనేని హాజరయ్యారు. అయితే అదే వేడుకకు కొఠారు అబ్బయ్య చౌదరి కూడా వచ్చారు. పెళ్లి చూసుకుని చింతమనేని తన కారులో ఇంటికి వెళ్తుండగా.. ఆయన కారుకు అబ్బయ్య చౌదరి కారు అడ్డుగా పెట్టాడు. కారును అడ్డు తీయాలని చింతమనేని డ్రైవర్ వెళ్లి అబ్బయ్య చౌదరిని అభ్యర్థించగా.. ఆయన విచక్షణ రహితంగా డ్రైవర్, గన్‌మ్యాన్‌లపై దాడికి పాల్పడ్డారు. దీంతో చింతమనేని డ్రైవర్ ఏలూరు త్రిటౌన్ పోలీస్ స్టేషన్‌లో అబ్బయ్య చౌదరిపై ఫిర్యాదు చేశాడు.
కాగా, వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలపై ఏపీలో వరుసగా కేసులు నమోదు కావడంతో ఆ పార్టీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎప్పుడు ఎవరు అవుతారోనన్న ఆందోళన నేతల్లో వ్యక్తం అవుతోంది. నిన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు నిన్న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అరెస్ట్ ఉంటుందన్న ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఇక, ఐదేళ్లు అధికారంలో ఉన్న వైసీపీ , టీడీపీ నాయకులను అంతమొందించడమే లక్ష్యంగా పని చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆ పార్టీ కార్యకర్తలపై దాడులకు పాల్పడింది. దాడి చేసిందే కాకుండా తిరిగి వారిపైనే పోలీసులతో పెట్టించి తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది.
Read Also: Delhi New CM : ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు ..!