Butta Renuka: వైఎస్సార్ సీపీ మాజీ ఎంపీ ఆస్తుల వేలం.. ఎందుకు ?

బుట్టా రేణుక(Butta Renuka), ఆమె భర్త నీలకంఠ 2018లో రూ.310 కోట్ల అప్పు తీసుకున్నారు. 15ఏళ్ల కాలవ్యవధి కోసం ఈ రుణాన్ని పొందారు.

Published By: HashtagU Telugu Desk
Butta Renuka Assets Auction Neelakantam Ysrcp Kurnool Andhra Pradesh

Butta Renuka: వైఎస్సార్ సీపీ మాజీ ఎంపీ బుట్టా రేణుక దంపతుల ఆస్తులను వేలం వేయనున్నారు. ఇంతకీ ఎందుకు.. అనుకుంటున్నారా ?  ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీకి అనుబంధ విభాగమైన ఎల్‌ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ లిమిటెడ్  నుంచి రేణుక దంపతులు రూ.310 కోట్ల అప్పు తీసుకున్నారు. అయితే దాన్ని తిరిగి చెల్లించలేదు. గత ఐదేళ్లుగా అప్పుల కిస్తీలు  కూడా కట్టలేదు.  దీంతో వారి ఆస్తుల వేలం దిశగా ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ కసరత్తు మొదలుపెట్టింది.  దీనికి సంబంధించిన అన్ని రకాల చట్టపరమైన ప్రక్రియలు పూర్తి చేసింది. ఇప్పటికే ఓ సారి వేలానికి పిలువగా, తగిన బేరం రాలేదు. దీంతో ఎల్ఐసీ మరోసారి రేణుక దంపతుల ఆస్తుల వేలానికి ప్రయత్నిస్తోంది.

Also Read :Kanchi Kamakoti Peetam : కంచి కామకోటి పీఠం ఉత్తరాధికారిగా తెలుగుతేజం గణేశశర్మ.. నేపథ్యమిదీ

అప్పుల చిట్టా ఇదీ.. 

  • బుట్టా రేణుక(Butta Renuka), ఆమె భర్త నీలకంఠ 2018లో రూ.310 కోట్ల అప్పు తీసుకున్నారు. 15ఏళ్ల కాలవ్యవధి కోసం ఈ రుణాన్ని పొందారు.
  • బుట్టా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, బుట్టా కన్వెన్షన్‌ సర్వీసెస్‌ లిమిటెడ్, మెరిడియన్‌ ఎడ్యుటెక్‌ సర్వీసెస్‌ కార్యకలాపాలకు ఈ రుణాన్ని వినియోగించారు.
  • ఈ అప్పులో రూ.40 కోట్ల వరకు తిరిగి చెల్లించారు. అసలు, వడ్డీ కలిపి ఇంకా రూ.340 కోట్లు కట్టాల్సి ఉంది.
  • వడ్డీ భారం ఎక్కువగా ఉన్నందున కొన్ని ఆస్తులను అమ్మేసి అప్పును రీషెడ్యూలు చేయాలని బుట్టా రేణుక దంపతులు కోరారు.
  • ఈ రుణం తీర్చేందుకు ప్రతినెలా ఈఎంఐగా రూ.3.40 కోట్లు చెల్లించాలి.  ఇంత కట్టలేమని రేణుక దంపతులు తేల్చి చెప్పారు.
  • గత ఐదేళ్లుగా రేణుక దంపతులు కిస్తీలు సక్రమంగా చెల్లించడం లేదు.
  • దీంతో ఎల్‌ఐసీ హౌజింగ్  ఫైనాన్స్  సంస్థ బెంగళూరు బ్రాంచి ప్రతినిధులు పలుసార్లు రేణుక దంపతులకు నోటీసులు పంపారు. అప్పులను తిరిగి చెల్లించమని కోరారు. అయితే ఈ చర్చలు విఫలం అయ్యాయి.
  • రేణుక దంపతులు అప్పులను చెల్లించడం ఆపేసినందున ఎన్‌సీఎల్‌టీని ఎల్‌ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ ఆశ్రయించింది. ప్రస్తుతం ఈ కేసు పెండింగ్‌ దశలో ఉంది.
  • రుణం ఇచ్చేటప్పుడు పొందుపర్చిన  నిబంధనలకు అనుగుణంగా బుట్టా రేణుక దంపతులకు చెందిన బంజారాహిల్స్‌లోని ఐదువేల గజాల ఆస్తిని రూ.145 కోట్లకు వేలం వేసేందుకు యత్నించారు. అయితే దాన్ని కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు.
  • బుట్టా రేణుక దంపతులకు చెందిన మాదాపూర్‌లోని 7,205 చదరపు గజాల బుట్టా కన్వెన్షన్‌‌ను వేలం వేసేందుకు యత్నించారు. దానికీ స్పందన రాలేదు.
  • ఈనేపథ్యంలో మరోసారి ఆయా ఆస్తుల వేలానికి ప్రయత్నిస్తున్నారు.
  • ఒకవేళ ఈ ఆస్తులను వేలంలో కొంటే  ఇబ్బందులు వస్తాయని చాలామంది వెనకంజ వేస్తున్నారు.

Also Read :ACB Raids : కాళేశ్వరం మాజీ చీఫ్ ఇంజినీర్ ఇంట్లో ఏసీబీ సోదాలు

  • బుట్టా రేణుకకు స్కూళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, హోటళ్లు, కార్ డీలర్ షిప్‌లు ఇలా చాలా వ్యాపారాలు ఉన్నాయి.
  • రేణుక దంపతుల నుంచి తమ రుణాన్ని వసూలు చేసుకోవాలనే పట్టుదలతో ఎల్ఐసీ ఉంది.
  Last Updated: 26 Apr 2025, 10:59 AM IST