ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక ప్రకటన చేశారు. సెప్టెంబర్ 17 లేదా 18 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నాయకులకు, ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఒక సవాలు విసిరారు. వైఎస్సార్సీపీ సభ్యులు సమావేశాలకు హాజరవుతారా, లేదా అనే విషయంపై స్పష్టత ఇవ్వాలని కోరారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్న జగన్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని ఆయన ప్రశ్నించారు.
Balakrishna : పులివెందుల ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చింది: ఎమ్మెల్యే బాలకృష్ణ
అయ్యన్నపాత్రుడు తన వ్యాఖ్యల్లో వైఎస్సార్సీపీ తీరును తీవ్రంగా విమర్శించారు. జగన్ అసెంబ్లీకి ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నిస్తూ, ప్రజల సమస్యలను సభలో లేవనెత్తాల్సిన బాధ్యత ప్రతిపక్షానికి లేదా అని నిలదీశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని, అందులో భాగంగానే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నామని అయ్యన్నపాత్రుడు తెలిపారు. ప్రతిపక్షం కూడా బాధ్యతగా వ్యవహరించి, సభకు హాజరై ప్రజల గొంతుక కావాలని ఆయన సూచించారు. అసెంబ్లీ సమావేశాలు రాజకీయ చర్చలకు, ప్రజా సమస్యల పరిష్కారానికి ఒక వేదికగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి.