Site icon HashtagU Telugu

Chandrababu : ఫస్ట్ నన్ను అరెస్ట్ చెయ్యండి – జగన్

Ys Jagan

Ys Jagan

‘సూపర్ సిక్స్ హామీలు (Super Six guarantees) ఇచ్చి ప్రజలను మోసం చేసిన చంద్రబాబు (Chandrababu)పై 420 కేసు ఎందుకు పెట్టకూడదు?’ అని వైసీపీ అధినేత, మాజీ జగన్ (Jagan) ప్రశ్నించారు. ‘చంద్రబాబు మోసాలపై నేను, మా పార్టీ నేతలు ట్వీట్లు చేస్తాం. ఎంత మందిని అరెస్ట్ చేస్తారో చూద్దాం. అరెస్టులు నా నుంచే మొదలెట్టండని చెబుతున్నా. ఇచ్చిన హామీలకు బడ్జెట్లో నిధులు ఎందుకు కేటాయించలేదని అడుగుతాం’ అని జగన్ పేర్కొన్నారు. బ‌డ్జెట్‌పై జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి (Jagan) పార్టీ కేంద్ర కార్యాల‌యంలో బుధ‌వారం మీడియాతో మాట్లాడారు.

కూటమి సర్కార్‌ మభ్యపెట్టే బడ్జెట్ ప్రవేశపెట్టిందని.. 8 నెలల పాటు బడ్జెట్‌ పెట్టకుండా ఎందుకు సాగదీశారంటూ జగన్ నిలదీశారు. బడ్జెట్‌ పత్రాలే బాబు డ్రామా ఆర్టిస్ట్‌ అని తేల్చాయి. బడ్జెట్‌ చూస్తే బాబు ఆర్గ్‌నైజ్డ్‌ క్రైమ్‌ తెలుస్తుంద‌న్నారు. ఇది ఏమైనా బ‌డ్జెటా అంటూ జ‌గ‌న్ చంద్ర‌బాబును నిల‌దీశారు. ఎన్నికల ముందు రాష్ట్ర అప్పులు రూ. 14 లక్షల కోట్లు అని దుష్ప్రచారం చేసారని.. అధికారంలోకి వచ్చాక కూడా చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తూ వస్తున్నారని మండిపడ్డారు. చివరకు గవర్నర్‌తో కూడా అబద్ధాలు చెప్పించారు. సూపర్‌ సిక్స్ హమీలను ఎగ్గొట్టేందుకు బాబు దుష్ప్రచారం చేశారు. 2018-19 నాటికి రూ.3 లక్షల 13 వేల కోట్ల అప్పు. మా ప్రభుత్వం దిగిపోయే నాటికి 6 లక్షల 46 వేల కోట్లు అప్పు. రూ.14 లక్షల కోట్లు అప్పు చేశామని దుష్ప్రచారం చేశారు. చంద్రబాబు హయాంలో 19 శాతం అప్పులు పెరిగితే.. మా హయాంలో 15 శాతం అప్పులు పెరిగాయి. ఎవరి పాలనలో రాష్ట్రం శ్రీలంక అయిపోయిందో చెప్పాలి. అప్పు రత్న బిరుదు ఎవరికివ్వాలి?. ఆర్థిక క్రమశిక్షణ పాటించింది ఎవరు?. అప్పుల పెంపు వార్షిక సగటు చంద్రబాబు హయాంలో కన్నా మా హయాంలో తక్కువ అని జగన్‌ వివరించారు.

ఏ రాష్ట్ర‌మైనా, ఏ ప్ర‌భుత్వ‌మైనా అప్పులు చేయ‌డ‌మ‌న్న‌ది బ‌డ్జెట్‌లో భాగ‌మే. ఎఫ్ఆర్‌బీఎం లిమిట్స్ ప్ర‌కారం అప్పులు చేసుకోవాలి. ఆర్బీఐ ద్వారా లోన్లు తీసుకుంటారు. అంతే ప‌ర్సెంటేజ్‌లో అప్పులు తీసుకుంటారు. ఇది అంద‌రికీ తెలిన సంగ‌తి. కానీ ఇదే అప్పుల‌పై చంద్ర‌బాబు ముఠా ఎలా ప్ర‌చారం చేశారో చూశాం. కార్పొరేష‌న్ లోన్లు తెచ్చుకోవాలంటే రాష్ట్రం కేపాసిటీ ఆధారంగానే ఇస్తారని జగన్ పేర్కొన్నారు.

రాష్ట్రం అతలాకుత‌లం అవుతున్న ప‌రిస్థితిలో చంద్ర‌బాబును ప్ర‌శ్నిస్తే దేశంలో ఎక్క‌డా లేని విధంగా 680 మంది సోష‌ల్ మీడియా యాక్టివిస్టులకు నోటీసులు ఇచ్చారు.. 140 మందిపై కేసులు, 49 మందిని అరెస్టు చేసారని పేర్కొన్నారు. ఎన్నికల వేళ ఇది చేస్తామ‌ని చెప్పిన సూప‌ర్ సిక్స్‌..దీనికి రూ.74 వేల కోట్లు అవ‌స‌రం. చంద్ర‌బాబు ..నీవు చేసింది మోసం కాదా? నీవు చెప్పింది అబ‌ద్ధం కాదా? నీవు చేసింది ఆర్గ‌నైజ్డ్ క్రైమ్ కాదా?. నీ మీద 420 కేసు ఎందుకు పెట్ట‌కూడ‌ద‌ని నేను ట్వీట్ చేస్తున్నాను. నాతో పాటు మా పార్టీ నాయ‌కులు, కార్య‌కర్త‌లుకూడా ట్వీట్ చేయాల‌ని పిలుపునిస్తున్నాను. అరెస్టు చేయాల్సి వ‌స్తే మొద‌ట న‌న్ను అరెస్టు చేయండి. ఎందుకు బ‌డ్జెట్లో ఈ ప‌థ‌కాల‌కు కేటాయింపులు చేయ‌లేద‌ని ప్ర‌శ్నిస్తూ రాష్ట్ర‌వ్యాప్తంగా ప్రతి ఒక్క‌రూ ట్వీట్ చేయాల‌ని జ‌గ‌న్ పిలుపునిచ్చారు.

Read Also : ICICI Credit Card New Rules : ICICI క్రెడిట్ కార్డు వాడే వారు తప్పక తెలుసుకోవాల్సిన వార్త..