Site icon HashtagU Telugu

Chandrababu : చంద్రబాబుని రాజమండ్రి GGH కు తరలించే ఏర్పాట్లు.. బాబు ఆరోగ్యం ..?

Chandrababu3

Chandrababu3

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ఆరోగ్యంపై టీడీపీ శ్రేణుల్లో ఆందోళ‌న నెల‌కొంది. వీఐపీ హోదాలో ఉన్న చంద్ర‌బాబుకు సౌక‌ర్యాలు క‌ల్పించ‌కుండా ప్ర‌భుత్వం మాన‌సికంగా, శారీర‌కంగా వేధిస్తుంద‌ని టీడీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. ఎండ తీవ్ర‌త ఎక్కువ‌గా ఉండ‌టంతో చంద్ర‌బాబు డీహైడ్రేష‌న్‌కు గురైయ్యారు. ఇదే విష‌యాన్నిచంద్ర‌బాబు కుటుంబ‌స‌భ్యుల‌కు ములాఖ‌త్‌లో చెప్పారు. జైలు అధికారుల‌కు ఫిర్యాదు చేసిన ప‌ట్టించుకోలేదు. తాజాగా ఆయ‌న‌కు స్కిల్ ఎల‌ర్జీ రావ‌డంతో హుటాహుటినా జీజీహెచ్ వైద్యుల‌తో పరీక్ష‌లు చేపించి అంతా బాగానే ఉంద‌ని రిపోర్ట్ ఇప్పించారు.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా చంద్ర‌బాబు నాయుడుని రాజ‌మండ్రి ప్ర‌భుత్వ ఆపుప‌త్రికి త‌ర‌లించేందుకు జైలు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జీజీహెచ్‌లో వీఐపీ వార్డులో ప్ర‌త్యేక గ‌దిని ఏర్పాటు చేసిన ఆయ‌న‌కు చికిత్స అందించేందుకు ఏర్పాటు చేస్తున్న‌ట్లు స‌మాచారం. నిన్న అర్ధరాత్రి హడావిడిగా ఆసుపత్రి గది పరిసరాలు పారిశుద్ధ కార్మికులు శుభ్రం చేశారు. ఆసుపత్రిలో అన్ని విభాగాలకు చెందిన అధికారులు సిబ్బంది అందుబాటు ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఇవ‌న్నీ చూస్తుంటే చంద్ర‌బాబు ఆరోగ్యంపై ఆందోళ‌న క‌లిగిస్తుంద‌ని టీడీపీ నేత‌లు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. జైలు అధికారులు హెల్త్ బులిటెన్‌లో అంతాబాగానే ఉంద‌ని చెప్తున్న‌ప్ప‌టికి.. అత్య‌వ‌స‌రంగా వీఐపీ గ‌దిలో ఏర్పాట్లు చేయ‌డంపై చంద్ర‌బాబు ఆరోగ్య ప‌రిస్థితి ఎలా ఉంద‌నే ఆందోళ‌న‌లో టీడీపీ శ్రేణులు ఉన్నారు.

Also Read:  I Am With CBN : మియాపూర్ టూ ఎల్బీన‌గ‌ర్‌.. నేడు చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తుగా మెట్రో రైలులో బ్లాక్ డ్రెస్‌ల‌తో ప్ర‌యాణం