Arnab Goswami : చంద్రబాబు రాజకీయాల్లో లెజెండ్.. అర్నబ్​ గోస్వామి ప్రశంసలు

Arnab Goswami : టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై ప్రముఖ జర్నలిస్ట్ అర్నబ్​ గోస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు.

  • Written By:
  • Publish Date - March 9, 2024 / 04:32 PM IST

Arnab Goswami : టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై ప్రముఖ జర్నలిస్ట్ అర్నబ్​ గోస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి పదవివి అలంకరించే అవకాశాలు వచ్చినా .. తిరస్కరించి ఎన్​డీఏ కూటమి జాతీయ కన్వీనర్​గా చంద్రబాబు వ్యవహరించారని చెప్పారు.  కేంద్రంలో తృతీయ కూటమిని ఏర్పాటు చేయడంతో పాటు ప్రధానమంత్రి, రాష్ట్రపతి అభ్యర్థులను నిర్ణయించడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారని చెప్పారు. ‘‘చంద్రబాబు నాయుడు విజనరీ లీడర్​. రాజకీయాల్లో ఆయన లెజెండ్. ప్రత్యర్థులు​ సైతం గౌరవించే అరుదైన నాయకుడు’’  అని అర్నబ్​ గోస్వామి(Arnab Goswami)  ప్రశంసల జల్లు కురిపించారు.

We’re now on WhatsApp. Click to Join

దేశ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు చక్రం తిప్పిన సమయంలో తాను మైక్​ పట్టుకొని ఆయన వెంట పరిగెత్తానని అర్నబ్ చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడు దేశానికి ఈ-గవర్నెన్స్ పరిచయం చేశారని, డిజిటలైజేషన్‌కు ఆద్యుడని తెలిపారు. నాయుడు సూచించిన వ్యక్తులే ప్రధానమంత్రులు, రాష్ట్రపతి అయిన సందర్భాలు కూడా ఉన్నాయని అర్నబ్ తెలిపారు. తాను అంత తేలిగ్గా ఎవరికీ పొగడ్తలు ఇచ్చేవాడిని కాదని ఆయన పేర్కొన్నారు. రాజకీయ నాయకుడిగా చంద్రబాబు పట్ల ప్రజలకు చాలా గౌరవం ఉందన్నారు.  ‘‘అప్పట్లో కాంగ్రెసేతర పార్టీలను కూడగట్టిన చంద్రబాబు, దేశ రాజకీయాల్లోనే తొలిసారి తృతీయ ఫ్రంట్ నేతృత్వంలో కేంద్రంలో ప్రభుత్వాలను ఏర్పరచడంలో కీలకపాత్ర పోషించారు. చంద్రబాబు సహకారంతో దేవెగౌడ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బయట నుంచి మద్దతు ప్రకటించిన కాంగ్రెస్ పట్టుబట్టడంతో తుదకు ఐకే గుజ్రాల్​ ప్రధాని అయ్యారు. థర్డ్ ఫ్రంట్​ జాతీయ కన్వీనర్‌గా వామపక్షాలు, ఇతర ప్రాంతీయ పార్టీలను ఐక్యంగా ఉంచడంలో చంద్రబాబు విజయవంతమయ్యారు’’ అని అర్నబ్ వివరించారు.

Also Read :Hibiscus Tea: గ్రీన్ టీ, బ్లాక్ టీ కాదు.. మందార టీ తాగండి.. బోలెడు ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు మీ సొంతం..!

  • 1999లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో టీడీపీ విజయాన్ని సాధించింది.
  • ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసన సభలో 294 సీట్లకుగానూ 185 సాధించింది.
  • అప్పట్లో 29 ఎంపీ సీట్లను గెలుచుకున్న టీడీపీ.. ఎన్​డీఏ సంకీర్ణ ప్రభుత్వంలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది.
  • 2004 సంవత్సరం వరకూ ఎన్డీఏ కూటమికి చంద్రబాబు కన్వీనర్‌గా వ్యవహరించారు. ఆ టైంలో మోడీ గుజరాత్​ ముఖ్యమంత్రిగా రాష్ట్ర రాజకీయాల్లో కొనసాగుతున్నారు.
  • రాష్ట్రపతి స్థానంలో దళితవర్గానికి చెందిన నారాయణన్‌ ఎంపికలో చంద్రబాబు పాత్ర ముఖ్యమైంది.

Also Read : Himachal Crisis : ఉత్తరాఖండ్‌లో హిమాచల్ ‘తిరుగుబాటు’ ఎమ్మెల్యేల క్యాంప్.. ఎందుకు ?