Site icon HashtagU Telugu

Constable Posts : తెలంగాణ, ఏపీలోనూ పోస్టులు.. 1130 సీఐఎస్​ఎఫ్ కానిస్టేబుల్స్ నోటిఫికేషన్

Cisf Constable Jobs

Constable Posts : ఇంటర్ పాసైన యువతకు గుడ్ న్యూస్.​ 1130 కానిస్టేబుల్​/ ఫైర్ పోస్టుల భర్తీకి సీఐఎస్​ఎఫ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులలో 32 ఆంధ్రప్రదేశ్‌లో, 26 తెలంగాణాలో ఉన్నాయి. మొత్తం 1130 పోస్టులలో 466 అన్ రిజర్వ్‌డ్ కేటగిరిలో ఉన్నాయి. 236 పోస్టులను(Constable Posts) ఓబీసీలకు, 153 పోస్టులను ఎస్సీలకు, 161 పోస్టులను ఎస్టీలకు,  114 పోస్టులను ఈడబ్ల్యూఎస్‌ వారికి రిజర్వ్ చేశారు. అర్హులైన వారు, తగిన దేహదారుఢ్య ప్రమాణాలు కలిగినవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

We’re now on WhatsApp. Click to Join
  • అభ్యర్థుల ఎత్తు కనీసం 170 సెం.మీ, ఛాతీ 80-85 సెం.మీ మేరకు ఉండాలి.
  • 2024 సెప్టెంబర్​ 30 నాటికి 18 నుంచి 23 ఏళ్లలోపు వయసు కలిగిన వారు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు.2001 అక్టోబర్​ 1 కంటే ముందు, 2006 సెప్టెంబర్​ 30 తర్వాత జన్మించిన వారు అప్లై చేయకూడదు. అయితే ఈఎస్‌ఎం/ ఓబీసీలకు మూడేళ్లు; ఎస్టీ, ఎస్సీలకు ఐదేళ్లపాటు వయోపరిమితిలో మినహాయింపు ఉంది.
  • జనరల్, ఓబీసీ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ.100. ఈఎస్‌ఎం, ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు లేదు.
  • అభ్యర్థులు అప్లికేషన్లను CISF అధికారిక వెబ్​సైట్ ద్వారా సమర్పించాలి.
  • ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్​ 30. అప్లికేషన్లలో మార్పులు చేసుకునేందుకు అక్టోబర్ 10 నుంచి 12 వరకు అవకాశమిస్తారు.

Also Read :Stock Market Movies : స్టాక్ మార్కెట్‌పై ఆసక్తి ఉందా ? చూడాల్సిన టాప్-6 మూవీస్ ఇవే

  • ఫిజికల్ స్టాండర్డ్​ టెస్ట్, ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, రాత పరీక్ష, డిటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్​ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
  • ఈ జాబ్స్‌కు ఎంపికయ్యే వారికి రూ.21,700 – రూ.69,100 మేర నెలవారీ పే స్కేలు అమలవుతుంది.
  • ఓఎంఆర్​ లేదా కంప్యూటర్ ఆధారిత పరీక్షను 2 గంటల పాటు నిర్వహిస్తారు. 100 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్‌ రీజనింగ్‌, జనరల్ నాలెడ్జ్ అండ్‌ అవేర్‌నెస్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్/ హిందీ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. నెగెటివ్ మార్కింగ్ లేదు.

Also Read :Top 5 Property Deals : సినీ ప్రముఖుల లేటెస్ట్ టాప్ -5 ప్రాపర్టీ డీల్స్ ఇవే..