TDP, BRS Alliance: `ఢిల్లీ` పై గేమ్‌? మోడీ పై తెలుగు పౌరుషం!!

రాజ‌కీయాల్లో కొన్ని ప‌రిణామాల‌ను ఊహించ‌లేం. అలాంటి ప‌రిణామం 2019 ఎన్నిక‌ల సంద‌ర్భంగా జ‌రిగింది. నాలుగు ద‌శాబ్దాలు భిన్న ధృవాలుగా ఉన్న కాంగ్రెస్, టీడీపీ పొత్తును చూశాం.

  • Written By:
  • Updated On - November 18, 2022 / 12:27 PM IST

రాజ‌కీయాల్లో కొన్ని ప‌రిణామాల‌ను ఊహించ‌లేం. అలాంటి ప‌రిణామం 2019 ఎన్నిక‌ల సంద‌ర్భంగా జ‌రిగింది. నాలుగు ద‌శాబ్దాలు భిన్న ధృవాలుగా ఉన్న కాంగ్రెస్, టీడీపీ పొత్తును చూశాం. ఈసారి జాతీయస‌మీక‌ర‌ణాలు, తెలుగు రాష్ట్రాల్లోని ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే, రాబోవు ఎన్నిక‌ల్లో టీడీపీ, టీఆర్ఎస్ క‌లిసి వెళ్లే అవ‌కాశం లేక‌పోలేదు. జాతీయ ఈక్వేష‌న్ దృష్ట్యా చంద్రబాబుతో కేసీఆర్ చేతులు క‌లుపుతార‌ని స‌రికొత్త ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఏపీలో బీజేపీ, వైసీపీ మ‌ధ్య ఫెవికాల్ బంధం ఉంద‌ని ఇటీవ‌ల విశాఖ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా మోడీ, ప‌వ‌న్ భేటీ తేల్చేసింది. తెలుగుదేశం, జ‌న‌సేన పొత్తు ప్ర‌య‌త్నానికి శాశ్వ‌తంగా ఆ భేటీ బ్రేక్ వేసింద‌ని స్ప‌ష్టం అవుతోంది. అదే సంద‌ర్భంలో టీడీపీ స‌హాయ‌, స‌హ‌కారాల‌ను తెలంగాణాలో బీజేపీ కోరుకుంటుంద‌ని వినికిడి. అందుకే, కేసీఆర్ రివ‌ర్స్ బ్రేక్ వేస్తూ బీజేపీకి చెక్ పెట్టేలా చంద్ర‌బాబుతో జ‌త క‌ట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నార‌ట‌.

Also Read:  2024 Election: ముగ్గురి ఎన్నిక‌ల స్లోగ‌న్ ఫిక్స్!

జాతీయ స్థాయిలో తెలుగు రాష్ట్రాలు రాజ‌కీయంగా ప్ర‌భావితం చూపాలంటే టీఆర్ఎస్, టీడీపీ క‌లిసి ప‌నిచేయాల‌ని గ‌త ఎన్నిక‌ల సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ ముందు చంద్ర‌బాబు ఒక ప్ర‌తిపాద‌న ఉంచారు. ఆనాడున్న ప‌రిస్థితుల దృష్ట్యా టీఆర్ఎస్ ఆ ప్ర‌తిపాద‌న ప‌క్క‌న పెట్టింది. ప్ర‌త్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీతో క‌లిసి 2018 అసెంబ్లీ, 2019 లోక్ స‌భ ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు ప‌నిచేశారు. ఫ‌లితంగా కాంగ్రెస్, టీడీపీల‌కు న‌ష్టం వాటిల్లింద‌ని ఇప్ప‌టి వ‌ర‌కు దూరంగా ఉంటున్నారు. కానీ, ఇప్పుడు జాతీయ ఈక్వేష‌న్ పూర్తిగా మారిపోయింది. దానికి అనుగుణంగా కేసీఆర్ కూడా బీజేపీ వ్య‌తిరేక స్టాండ్ తీసుకున్నారు. అంతేకాదు, బీజేపీ వ్య‌తిరేకుల‌తో క‌లిసి ప‌నిచేయ‌డానికి బీఆర్ఎస్ సిద్ధంగా ఉంద‌ని ప్ర‌క‌టించారు.

ఏపీలో చంద్ర‌బాబుతో క‌లిసేందుకు బీజేపీ ఏ మాత్రం అంగీక‌రించ‌డంలేదు. ఆ విష‌యాన్ని జ‌న‌సేనాని ద్వారా సంకేతాలు మోడీ పంపారు. ఆ క్ర‌మంలో ప్ర‌త్యామ్నాయంగా బీజేపీ వ్య‌తిరేక పార్టీల‌తో చంద్ర‌బాబు జ‌త క‌ట్ట‌డానికి అవ‌కాశం ఉంది. అదే ఈక్వేష‌న్ తో కేసీఆర్ కూడా ఉన్నారు. ఫ‌లితంగా వాళ్లిద్ద‌రూ అసెంబ్లీ ఎన్నిక‌ల సందర్భంగా తెలంగాణ‌లో పొత్తు పెట్టుకునే అవ‌కాశం లేక‌పోలేదు. లోక్ సభ ఎన్నిక‌ల నాటికి కాంగ్రెస్, బీఆర్ఎస్, టీడీపీ, క‌మ్యూనిస్ట్ లు, బీఎస్పీ కూట‌మిగా ఇరు రాష్ట్రాల్లో వెళ్లే అవ‌కాశం ఉంది. బీజేపీని జాతీయ స్థాయిలో నిలువ‌రించ‌డానికి చంద్ర‌బాబు, కేసీఆర్ చేతులు క‌లుపుతార‌ని స‌రికొత్త ప్ర‌చారం తెర‌మీద‌కు వ‌చ్చింది.

Also Read:  CM KCR: నూతన సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించిన కేసీఆర్‌!

మొత్తం మీద తెలందాలో 2023 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీడీపీ, టీఆర్ఎస్ పొత్తు ఉంటే, లోక్ స‌భ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీని కూట‌మిలో చేర్చుకుని ఇరు రాష్ట్రాల్లో బీజేపీ, వైసీపీ, జ‌న‌సేన భ‌ర‌తం ప‌ట్టాల‌ని గురుశిష్యులు మాస్ట‌ర్ స్కెచ్ వేస్తున్నార‌ని తెలుస్తోంది. అవ‌స‌ర‌మ‌నుకుంటే, అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ జాతీయ స్థాయి స‌మీక‌ర‌ణాల దృష్ట్యా కాంగ్రెస్ తో క‌లిసి ప‌నిచేయ‌డానికి చంద్ర‌బాబు, కేసీఆర్ సిద్ధంగా ఉన్నార‌ని తెలుస్తోంది. అందుకే ఈసారి ఎన్నిక‌ల నాటికి అనూహ్య ప‌రిణామాలను చూడొచ్చ‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జరుగుతోంది.