Legislative Council: శాసనమండలి వైసీపీ అభ్యర్థులు వీళ్ళే!

సామాజిక వర్గాల వారీగా అభ్యర్థులకు అవకాశం ఇచ్చేలా బీసీ, ఎస్సీ ,ఎస్టీ, మైనారిటీ వర్గాలకు పెద్ద పీట వేసినట్టు తెలుస్తుంది. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కసరత్తు పూర్తి చేశారు. శాసనమండలి ఎన్నికలకు సంబంధించి స్థానిక సంస్థలు, ఎమ్మెల్యే, గవర్నర్ కోటాలో అభ్యర్థుల ఎంపిక సంబంధించి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కసరత్తు పూర్తి చేసినట్లు తెలిసింది. సామాజిక వర్గాల వారీగా అభ్యర్థులకు అవకాశం కల్పిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ ఐ ప్యాక్ టీం సూచించినట్లుగా బీసీ, ఎస్సీ […]

Published By: HashtagU Telugu Desk
AP Politics CM Jagan Mohan Reddy

Ap Cm Politics Jagan Mohan Reddy

సామాజిక వర్గాల వారీగా అభ్యర్థులకు అవకాశం ఇచ్చేలా బీసీ, ఎస్సీ ,ఎస్టీ, మైనారిటీ వర్గాలకు పెద్ద పీట వేసినట్టు తెలుస్తుంది. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కసరత్తు పూర్తి చేశారు. శాసనమండలి ఎన్నికలకు సంబంధించి స్థానిక సంస్థలు, ఎమ్మెల్యే, గవర్నర్ కోటాలో అభ్యర్థుల ఎంపిక సంబంధించి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కసరత్తు పూర్తి చేసినట్లు తెలిసింది. సామాజిక వర్గాల వారీగా అభ్యర్థులకు అవకాశం కల్పిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ ఐ ప్యాక్ టీం సూచించినట్లుగా బీసీ, ఎస్సీ ,ఎస్టీ, మైనారిటీ వర్గాలకు పెద్ద పీట వేసినట్లు తెలిసింది. స్థానిక సంస్థల్లో నెల్లూరు నుంచి మేరీ గ మురళీధర్ (గూడూరు), కడప నుంచి పి. రామ సుబ్బారెడ్డి (మాజీ మంత్రి జమ్మల మడుగు), తూర్పుగోదావరి జిల్లా నుంచి కుడిపూడి సూర్యనారాయణ (అమలాపురం) జయ మంగళం వెంకటరమణ (మాజీ ఎమ్మెల్యే కైకలూరు), అనంతపురం నుంచి మాజీ ఎంపీ హిందూపురం గంగాధర్ లేదా ఆయన సతీమణి, లేదా నవీన్ నిచ్చల్, రజక కార్పొరేషన్ చైర్మన్ రంగన్న, పశ్చిమగోదావరి జిల్లాలో వంకా రవీంద్ర లేదా జి . నాగబాబు శ్రీకాకుళంలో నీలకంఠ నాయుడు లేదా నర్త రామారావు ఎమ్మెల్యేల, గవర్నర్ కోటాలో డొక్కా మాణిక్య వరప్రసాద్, మర్రి రాజశేఖర్, పోతుల సునీత, ఎస్ సి వి నాయుడు, డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం, యార్లగడ్డ వెంకట్రావు, చల్లా శ్రీలక్ష్మి, జంకె వెంకటరెడ్డి, రావి రామనాథం బాబు, ముస్లింలలో ఒకరికి, బొప్పన భువన కుమార్ తదితరుల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం ఇప్పటికే ఉపాధ్యాయ, పట్టభద్రుల స్థానాలకు అభ్యర్థులు ప్రకటించిన విషయం విదితమే.

వైసీపీ 18 మంది ఎమ్మెల్సీ అభ్యర్ధుల ప్రకటన

బీసీ లకు పెద్ద పీట వేస్తూ
18 ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్ధులను ప్రతిపాదించారు.
స్థానిక సంస్థల కోటాలో 9
ఎమ్మెల్యే కోటాలో: 7
గవర్నర్ కోటాలో: 2, ఎస్సీ: 2
ఎస్టీ: 1,బీసీ: 11,ఓసి: 4 స్థానిక సంస్థలు:
1) నర్తు రామారావు
2) కుడిపూడి సూర్యనారాయణ
3) వంకా రవీంద్రనాథ్
4)కవురు శ్రీనివాస్
5) మెరుగ మురళి
6) డా. సిపాయి సుబ్రమణ్యం
7) రామసుబ్బారెడ్డి
8) డాక్టర్ మధుసూధన్
9) ఎస్ మంగమ్మ

ఎమ్మెల్యే కోటా:
10) పీవీవీ సూర్యనారాయణరాజు
11) పోతుల సునీత
12) కోలా గురువులు
13) బొమ్మి ఇజ్రాయెల్
14) ఏసు రత్నం
15) మర్రి రాజశేఖర్
16) జయమంగళ వెంకటరమణ

గవర్నర్ కోటా
17) కుంబా రవిబాబు
18) కర్రి పద్మశ్రీ

Also Read:  AP Politics: చంద్రబాబు, విజయసాయిరెడ్డి ఫోటో, రాజకీయ వైరల్ కోణం!

  Last Updated: 20 Feb 2023, 04:15 PM IST