Site icon HashtagU Telugu

Circuit Tour Buses : సర్క్యూట్ టూర్ బస్సులను సిద్ధం చేసిన APSRTC

Apsrtc Prepared Circuit Tou

Apsrtc Prepared Circuit Tou

పర్యాటకుల కోసం APSRTC సర్క్యూట్ టూర్ బస్సులను (Circuit Tour Buses) సిద్ధం చేసింది. మాములుగా ప్రవైట్ ట్రావెల్స్ వారు ఇలాంటి సర్క్యూట్ టూర్ బస్సులను నడుపుతుంటారు. కానీ ఇప్పుడు APSRTC సైతం ట్రావెల్ బస్సుల మాదిరిగా సర్క్యూట్ టూర్ బస్సులను నడపబోతుంది. విజయవాడ, అమరావతి, మంగళగిరి, పొన్నూరు, బాపట్ల సూర్యలంక బీచ్‌లని కవర్ చేస్తూ ప్రతిరోజూ విజయవాడ నుండి సర్క్యూట్ బస్సు బయలుదేరుతుంది.

అలాగే విజయవాడ, గుంటూరు, శ్రీశైలం, త్రిపురాంతకం, కోటప్పకొండ మీదుగా మరో టూర్ కూడా అందుబాటులో ఉంది. శ్రీశైలం వెళ్లాలనుకునే వారికోసం హైదరాబాద్, కర్నూలు నుంచి కొన్ని సర్క్యూట్ బస్సులు అందుబాటులో ఉన్నాయి. అలాగే కర్నూలు నుంచి అహోబిలం, మహానంది, శ్రీశైలం కవర్ చేస్తూ తిరిగి కర్నూలు చేరుకునే బస్సు , అలాగే.. కర్నూలు నుంచి యాగంటి, మహానంది, శ్రీశైలం కవర్ చేస్తూ కర్నూలు చేరుకునే బస్సు, ఇంకా.. కర్నూలు నుంచి మంత్రాలయం అప్ అండ్ డౌన్ బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే పంచారామ క్షేత్రాలను ఒకే ట్రిప్‌లో కవర్ చేస్తూ విజయవాడ నుంచి మరో బస్సు సర్వీస్ అందుబాటులో ఉంది.

We’re now on WhatsApp. Click to Join.

విజయవాడ నుండి అమరావతి మీదుగా భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, పిఠాపురం ఏరియాలను కవర్ చేసుకుని తిరిగి విజయవాడ చేరుకుంటుంది. అలాగే రాజమహేంద్రవరం నుంచి దాక్షారామం, పిఠాపురం, అన్నవరం ప్రాంతాలను కవర్ చేసే మరో బస్సు టూర్ కూడా అందుబాటులో ఉంది. ఈ బస్సు టికెట్లను మీరు డైరెక్ట్ గా బస్ స్టేషన్లలో కొనుగోలు చేయొచ్చు. ఈ బస్సులు ఎక్కువగా పర్యాటక ప్రాంతాలు, పుణ్యక్షేత్రాల దర్శనానికి అనుకూలంగా ఉన్నాయి. ఈ బస్సుల్లో వెళ్లేవారికి ప్రత్యేక ప్యాకేజీలు ఉంటాయి. సరైన ప్లాన్ చేసుకొని వెళ్తే.. టూర్ వేగంగా పూర్తవ్వడమే కాకుండా.. ప్రయాణం మొత్తం సౌకర్యవంతంగా సాగుతుందని అధికారులు చెబుతున్నారు.

Read Also : Hyderabad: వాటర్ మరమ్మతు పనులు వాయిదా, తేదీలు మార్పు