Investments in AP : ఏపీకి మహర్దశ.. ఆ జిల్లాలో రూ.70వేల కోట్ల పెట్టుబడులు

Investments in AP : ఏపీకి మహర్దశ పట్టుకున్నది. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో రూ.70 వేల కోట్లతో ఆర్సెలార్‌ మిత్తల్‌ నిప్పాన్‌ స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు కానుంది.

Published By: HashtagU Telugu Desk
Amaravati

Amaravati

Investments in AP : ఏపీకి మహర్దశ పట్టుకున్నది. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో రూ.70 వేల కోట్లతో ఆర్సెలార్‌ మిత్తల్‌ నిప్పాన్‌ స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు కానుంది. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు జారీ చేశాయి.త్వరలో శంకుస్థాపన జరగనుంది. ఈ కర్మాగారం మొదటి దశలో 7.3 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేయనుండగా..20 వేల మందికి ఉపాధి లభించనుంది. దీనిపై భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ కీలక ప్రకటన చేశారు. ఈ ఫ్యాక్టరీకి అవసరమైన అన్ని అనుమతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేశాయన్నారు.

West Bengal : “అమ్మను మా ఇంటికి పంపించండి”..మమతా బెనర్జీకి ఐదేళ్ల బాలుడి లేఖ

ఢిల్లీలో జరిగిన 6వ ఉక్కు సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ఫ్యాక్టరీ శంకుస్థాపనపై క్లారిటీ ఇచ్చారు. దేశ ఆర్థికాభివృద్ధికి భారీ ఉక్కు పరిశ్రమ చాలా ముఖ్యమని కేంద్రమంత్రి పేర్కొన్నారు.మన దేశ జీడీపీలో దీని వాటా 2% ఉందని.. దేశం అభివృద్ధి చెందడానికి, స్వయం సమృద్ధి సాధించడానికి ఇది చాలా అవసరమన్నారు. 2030 నాటికి దేశీయంగా 300 మిలియన్‌ టన్నుల ఉక్కు ఉత్పత్తిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

1.47లక్షల కోట్ల పెట్టుబడులు…

అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఆర్సెలార్‌ మిత్తల్, నిప్పన్‌ స్టీల్స్‌ కలిసి రూ.1.47 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. మొదటి దశలో రూ.70 వేల కోట్లతో 7.3 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేయనున్నారు. ఈ మేరకు ముడి ఖనిజం సరఫరా కోసం ఎన్‌ఎండీసీతో ఒప్పందం కుదిరింది. నక్కపల్లి మండలం రాజయ్యపేట దగ్గర 2,200 ఎకరాల భూమిని కర్మాగారం కోసం కేటాయించారు. ప్లాంట్ నిర్మాణం మొదటి దశలో 20 వేల మందికి ఉపాధి లభిస్తుంది. రెండో దశలో ఉత్పత్తి సామర్థ్యాన్ని 10.5 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెంచనున్నారు.

ఈ స్టీల్ ప్లాంట్ తొలి దశలో భాగంగా నాలుగేళ్లలో రూ.70వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది.2029 జనవారి నాటికి మొదటి దశ పనులు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారట.. మొదటి దశలో 20 వేల మందికి ఉపాధి లభిస్తుందని, రెండో దశలో రూ.80వేల కోట్ల వరకు పనులు చేపట్టాలని భావిస్తున్నట్లు సమాచారం.2035 నాటికి 4వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని ప్లాన్ చేస్తున్నారట.

మిత్తల్ సంస్థ రూ.11,198 కోట్లతో ఉక్కు కర్మాగారానికి అనుసంధానంగా కో-టెర్మినస్ క్యాప్టివ్ పోర్టును అభివృద్ధి చేయనుంది. ఈ పోర్టు నిర్మాణానికి రెండు దశల్లో పెట్టుబడులు పెట్టనున్నారు. దీని ద్వారా వేల మందికి ఉపాధి లభిస్తుందని భావిస్తున్నారు.. మొదటి దశలో రూ.5,816 కోట్లతో పోర్టు నిర్మాణం చేపట్టనున్నారు.పోర్టు నిర్మాణానికి 150 ఎకరాల భూమిని కేటాయించాలని సంస్థ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. రెండో దశలో పోర్టు విస్తరణ కోసం రూ.5,382 కోట్లు ఖర్చు చేయనున్నారు.

Red Sea : అందువల్లే.. ఎర్ర సముద్రంలో కేబుళ్లు కట్‌..!

  Last Updated: 09 Sep 2025, 01:44 PM IST