Site icon HashtagU Telugu

Group 1 Prelims : రేపటి నుంచే గ్రూప్-1 ప్రిలిమ్స్ హాల్‌టికెట్లు.. 17న ఎగ్జామ్

APPSC Group-1 Prelims 2024

Appsc Group 1 Recruitment 2

Group 1 Prelims : ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష హాల్‌టికెట్లను రేపటి (మార్చి 10) నుంచి అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లను పొందొచ్చు. ఈమేరకు ఏపీపీఎస్సీ సెక్రటరీ ఒక ప్రకటన విడుదలచేశారు.

We’re now on WhatsApp. Click to Join

మార్చి 17న గ్రూప్-1 ప్రిలిమ్స్(Group 1 Prelims) ఎగ్జామ్ ఉంటుంది. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి  మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు పేపర్-2 పరీక్షలు జరుగుతాయి. గ్రామీణ అభ్యర్థులు తమకు కేటాయించిన పరీక్షా కేంద్రాలున్న నగరాలను కనీసం ఒకరోజు ముందుగానే చూసుకొని వస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా సమయానికి పరీక్షకు హాజరు కావచ్చు.

Also Read : AP Jobs : ఆ మూడు ప్రభుత్వ శాఖల్లో జాబ్స్.. భారీగా శాలరీలు

Also Read : Train Haltings : ఏపీ, తెలంగాణలో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు కొత్త స్టాప్‌లు ఇవే..

రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్స్ 06 పోస్టులు,  డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్: 01 పోస్టు, డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ 03 పోస్టులు,  డిప్యూటీ రిజిస్ట్రార్ 05 పోస్టులు, మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్-2) 01 పోస్టు, అసిస్టెంట్ ప్రొహిభిషన్ & ఎక్సైజ్ సూపరింటెండెంట్ 01 పోస్టు, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్/అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ 03 పోస్టులు, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్ 04 పోస్టులు, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ 02 పోస్టులను కూడా ఏపీపీఎస్సీ భర్తీ చేయనుంది.

ప్రిలిమ్స్ పరీక్ష విధానం ఇదీ..