మద్యం టెండర్ (Liquor Tender) దరకాస్తు దారులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) తీపి కబురు తెలిపింది. మద్యం టెండర్ల షెడ్యూల్లో మార్పులు చేస్తూ ప్రకటన చేసింది. ఈ నెల11వ తేదీ సాయంత్రం 5 గంటలకు వరకు దరఖాస్తులకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. దరఖాస్తులు 11వ తేదీన సాయంత్రం 5గంటలకు ముగియగ, 14వ తేదీన డ్రా తీయనున్నట్లు.. 16వ తేదీ నుంచి కొత్త దుకాణాలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. మద్యం టెండర్ల షెడ్యూలును మార్చాలని ప్రభుత్వానికి పలువురు నుంచి విఙప్తులు వచ్చాయి. దసరా సెలవులు కావడంతో బ్యాంకులు పని చేయవని పలువురు దరఖాస్తుదారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.
వివిధ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తులతో సానుకూలంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం మద్యం టెండర్ల షెడ్యూల్లో మార్పులు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన మద్యం పాలసీలో భాగంగా జిల్లాలో ఏర్పాటు చేయనున్న 123 ప్రభుత్వ మద్యం దుకాణాలకు ఈ నెల 11వ తేదీన లాటరీ నిర్వహించనున్నారు. మచిలీపట్నంలోని నోబుల్ కళాశాల ప్రాంగణంలో ఉదయం ఎనిమిది గంటల నుంచి మద్యం దుకాణాలను లాటరీ పద్ధతిలో కేటాయించనున్నారు. ఇందు కోసం ఎనిమిది కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎనిమిది మంది ప్రత్యేక అధికారులు పర్యవేక్షిస్తారు. మద్యం దుకాణాలు దక్కించుకున్న వారు అదే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రెండు బ్యాంకు కౌంటర్లలో నిర్దేశించిన నగదును చెల్లిస్తే వెంటనే 15 రోజులకు సరిపడా లైసెన్సును మంజూరు చేస్తారు. ఈ నెల 14వ తేదీ నుంచి మద్యం దుకాణాలు ప్రారంభం కానున్నాయి.
Read Also : Singer Sunitha : సింగర్ సునీత కాపురంలో చిచ్చుపెట్టిన యూట్యూబర్ ..?