Votes Counting : జూన్ 4న ఓట్ల లెక్కింపు ఎలా జరుగుతుందో తెలుసా ?

జూన్ 4వ తేదీ సమీపిస్తోంది. ఇప్పుడు అందరి చూపు ఆ రోజు జరిగే ఓట్ల లెక్కింపుపైనే ఉంది.

  • Written By:
  • Updated On - May 30, 2024 / 08:02 AM IST

Votes Counting : జూన్ 4వ తేదీ సమీపిస్తోంది. ఇప్పుడు అందరి చూపు ఆ రోజు జరిగే ఓట్ల లెక్కింపుపైనే ఉంది. ఓట్ల లెక్కింపు 4న ఉదయం 8 గంటలకు మొదలవుతుంది. ఆ తర్వాత మొత్తం నాలుగు దశల్లో ఓట్ల లెెక్కింపు ఘట్టం కొనసాగుతుంది. ఆ వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join

కౌంటింగ్‌లో కీలక దశలు ఇవే.. 

  • జూన్ 4న  ఓట్ల లెక్కింపు విధుల్లో ఉన్న సిబ్బంది అంతా ఉదయం 4 గంటలకే కౌంటింగ్ కేంద్రాలకు చేరుకుంటారు.
  • వారితో కౌంటింగ్‌ గోప్యతపై ప్రమాణం చేయిస్తారు. ఆ తర్వాత నిర్దేశిత సమయానికి లెక్కింపు ప్రారంభమవుతుంది.
  • ఓట్ల లెక్కింపు ప్రారంభానికి ముందు పోటీలో ఉన్న అభ్యర్థులు, వారి ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్‌రూంలను తెరుస్తారు. వాటిలోని ఈవీఎంలను లెక్కింపు(Votes Counting) టేబుళ్లపైకి చేరుస్తారు.
  • తొలుత సైనికదళాల్లో పనిచేసేవారు ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్‌మిటెడ్‌ పోస్టల్‌ బ్యాలట్‌ సిస్టమ్‌ (ఈటీపీబీఎస్‌)లో వేసిన ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత వారికి సంబంధించి పోస్టల్‌ బ్యాలట్‌ పత్రాల్లో వచ్చిన ఓట్లను లెక్కపెడతారు.
  • ఉదయం 8.30కు ఈవీఎంలలో నమోదైన ఓట్ల లెక్కింపు మొదలవుతుంది.
  • సగటున ప్రతి అరగంటకు ఒక రౌండ్‌ ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది.
  • ఈవీఎంలలో నమోదైన ఓట్ల లెక్కింపు కోసం ఒక్కో శాసనసభ నియోజకవర్గానికి 14 చొప్పున కౌంటింగ్‌ టేబుళ్లను ఏర్పాటుచేస్తారు.

Also Read :Maruti Suzuki New Swift: ఇదేంటి.. కారు బ‌రువు త‌గ్గితే మైలేజీ పెరుగుతుందా..?

  • ఆయా నియోజకవర్గాల్లోని పోలింగ్‌ కేంద్రాల సీరియల్‌ నంబర్‌ ఆధారంగా ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు చేపడతారు.
  • ఓట్ల లెక్కింపు సందర్భంలో ఏదైనా ఈవీఎం బ్యాటరీ పనిచేయకపోయినా, మొరాయించినా, తెరిచేందుకు అవకాశం లేకపోయినా వాటిని పక్కన పెట్టేసి ఆ తర్వాత సీరియల్‌ నంబర్‌లో ఉన్న పోలింగ్‌ కేంద్రాల ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు.
  • ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు మొత్తం పూర్తయ్యాక.. మొరాయించిన ఈవీఎంల వీవీప్యాట్‌ చీటీలను లెక్కిస్తారు. వాటిలో నమోదైన ఓట్లను పరిగణనలోకి తీసుకుంటారు.
  • ఉదయం 11 గంటల సమయానికి ఫలితాలపై కొంత స్పష్టత వస్తుంది.
  • మధ్యాహ్నం 3 గంటలకు లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉంటుంది.
  • ఈవీఎంలలో నమోదైన ఓట్ల తుది రౌండ్‌  లెక్కింపు మొత్తం పూర్తై, వాటిని సరిచూసుకుని నిర్ధారించుకున్న తర్వాత వీవీ ప్యాట్‌ చీటీల లెక్కింపు ప్రారంభమవుతుంది.
  • లాటరీ విధానంలో ఎంపికచేసిన ఐదు కేంద్రాల వీవీ ప్యాట్‌లను బయటకు తీస్తారు.
  • ఈ చీటీల లెక్కింపు కోసం ప్రత్యేకంగా మెష్‌తో ఒక బూత్‌ను ఏర్పాటుచేసి అక్కడే లెక్కిస్తారు.
  • ఈవీఎంలలో అభ్యర్థులకు నమోదైన ఓట్లకు, వీవీ ప్యాట్‌ చీటీల్లో వచ్చిన ఓట్లకు మధ్య వ్యత్యాసమొస్తే రెండోసారి, మూడోసారి లెక్కిస్తారు. అప్పటికీ తేడా వస్తే వీవీ ప్యాట్‌ చీటీల్లోని ఓట్లనే పరిగణనలోకి తీసుకుని తుది ఫలితాలు ప్రకటిస్తారు.
  • వీవీ ప్యాట్‌ చీటీల లెక్కింపు పూర్తయ్యాకే అధికారికంగా తుది ఫలితాలను రిలీజ్ చేస్తారు.

Also Read : Team India Schedule: 2025 ఐపీఎల్ వ‌ర‌కు టీమిండియా ఫుల్ బిజీ.. పూర్తి షెడ్యూల్ ఇదిగో..!