Site icon HashtagU Telugu

AP Voters List : ఏపీ ఓటర్ల జాబితాను రిలీజ్ చేసిన ఎన్నికల సంఘం

Section 144

Section 144

ఏపీ ఓటర్ల జాబితాను (AP Voters List) విడుదల చేసిన ఎన్నికల సంఘం. మొత్తం 4,01,53,292 మంది ఓటర్లు ఉండగా.. పురుష ఓటర్లు 1,97,66,013, మహిళా ఓటర్లు 2,03,83,471 , థర్డ్ జెండర్ ఓటర్లు 3,808 ఉండగా.. సర్వీసు ఓటర్లు 68,158 మంది ఉన్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఈ మేరకు ఓటర్ల జాబితాను ఆన్‌లైన్‌లో ఉంచారు. ఓటర్ల జాబితాను అన్ని జిల్లాల్లోని రాజకీయ పార్టీలకు ఇవ్వాల్సిందిగా జిల్లా అధికారులకు ఈసీ సూచించింది. ఈ జాబితాలో ఏమైనా అభ్యంతరాలు ఉంటె.. డిసెంబరు 9 లోపు తెలియజేయాలని తెలిపారు. అలాగే 18-19 సంవత్సరాల కొత్త ఓటర్ల సంఖ్య 2,88,155 గా తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

2023 జనవరి 5 తేదీ తర్వాత ఓటర్లుగా నమోదైన వారి సంఖ్య 15,84,789 తెలిపింది. అలాగే రాష్ట్రంలో ఎన్నికల సంఘం జాబితా ప్రకటించే నాటికి తొలగించిన ఓట్ల సంఖ్య 13,48,203 గా పేర్కొంది. ఇందులో 7,10,000 మృతి చెందారని , 5,78,625 ఇతర ప్రాంతాలకు బదిలీ అయ్యారని తెలిపింది. అలాగే
పునరావృతమైన ఓటర్ల సంఖ్య 81,185 ప్రకటించింది. ఇక రాష్ట్రంలో మొత్తం పోలింగ్ కేంద్రాల సంఖ్య 46,165 కాగా అనంతపురం జిల్లాలో అత్యధికంగా 19,79,775 మంది ఓటర్లు, అత్యల్పంగా అల్లూరి జిల్లాలో 7,40,857 మంది ఓటర్లు గా పేర్కొంది. 2022 జనవరి 6 నుంచి 2023 ఆగస్టు 30వరకు అన్ని స్థాయుల్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ చేపట్టినట్లు ఈసీ వెల్లడించింది. 21,18,940 ఓట్ల తొలగింపు ప్రక్రియను పునః పరిశీలన చేసినట్టు తెలిపింది. ఆగస్టులో చేపట్టిన ఇంటింటి సర్వేలో జీరో డోర్ నెంబర్లతో 2,51,767 ఓట్లు గుర్తించినట్టు స్పష్టం చేసింది.

1,57,939 ఇళ్లలో 10 మంది కంటే ఎక్కువ మంది ఓటర్లు నమోదైనట్టు గుర్తించి, ప్రత్యేక డ్రైవ్ చేపట్టి జీరో డోర్ నెంబర్లలో నమోదైన ఓటర్లను 66,740కి కుదించినట్లు ఈసీ తెలిపింది. 10 మంది ఓటర్ల కంటే ఎక్కువ ఉన్న ఇళ్లను కూడా తనిఖీ చేసి, దానిని 71,581కి తగ్గించినట్టు వెల్లడించింది.

Read Also : Bithiri Sathi Joins BRS : బిఆర్ఎస్ లో చేరగానే కేసీఆర్ ను మెగా హీరోతో పోల్చిన బిత్తిరి సత్తి