Site icon HashtagU Telugu

CM Chandrababu : ఏపీని లాజిస్టిక్స్ హబ్‌గా తీర్చిదిద్దుతాం

CM Chandrababu

CM Chandrababu

CM Chandrababu : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అతిపెద్ద లాజిస్టిక్స్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నట్లు ప్రకటించారు. మంగళవారం ఆయన రెండు వేర్వేరు మారిటైమ్ లాజిస్టిక్స్ పుస్తకాల ఆవిష్కరణతో పాటు, ఎయిర్ కార్గో ఫోరం ఆఫ్ ఇండియా.. ఏపీ చాప్టర్‌ను ప్రారంభించారు. చంద్రబాబు మాట్లాడుతూ, “ఈస్ట్ కోస్ట్ గేట్‌వేగా ఆంధ్రప్రదేశ్ బెస్ట్ ప్లేస్” అని పేర్కొన్నారు. రాష్ట్ర పోర్టులను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక అడ్వైజరీ బాడీని ఏర్పాటు చేసి, ప్రతి ఆరు నెలలకు ఒకసారి సమావేశమై సూచనలు తీసుకుంటామని తెలిపారు. ఆ సూచనల ఆధారంగా ఒక సమగ్ర పాలసీని రూపొందిస్తామని వెల్లడించారు.

“భవిష్యత్తు లాజిస్టిక్స్ రంగానిదే. అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాలకు ఇది అత్యంత కీలక అంశం. రోడ్డు, రైలు, జల, వాయు మార్గాలు, అంతర్గత జల రవాణా..ఆల్ రౌండ్ గా అనుసంధానం కావాలి. లాజిస్టిక్స్ పార్కులు, డ్రై పోర్టులు కూడా స్థాపించాల్సి ఉంది,” అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా రవాణా వ్యయం 8 శాతం మాత్రమే ఉంటే, దేశంలో అది 13 శాతంగా ఉందని, దీన్ని తగ్గించే దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. “గతంలో విద్యుత్ ఉత్పత్తి వ్యయం ఎక్కువగా ఉండేది. సంస్కరణల వల్లే తగ్గింది. ఇదే విధంగా గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా అందుబాటులోకి వస్తే మరింత ప్రయోజనం కలుగుతుంది,” అని చంద్రబాబు గుర్తుచేశారు.

Air India : ఎయిరిండియా గుడ్‌న్యూస్‌.. ఆ ప్రయాణికుల కోసం భారీ డిస్కౌంట్లు

భారత్ తదుపరి దశ సంస్కరణల దిశగా అడుగులు వేస్తోందని, అన్ని రంగాల్లోనూ టెక్నాలజీ అనుసంధానాన్ని పెంచుతున్నామని అన్నారు. అమరావతిలో క్వాంటం వ్యాలీ, కర్నూలులో డ్రోన్ సిటీ ఏర్పాటుకు ఉదాహరణగా పేర్కొన్నారు. పోర్టు ఆపరేషన్లు, వ్యవసాయం, వైద్యారోగ్య రంగాల్లో డ్రోన్ల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.

సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో భాగంగా జీరో పావర్టీ, ఉద్యోగావకాశాల సృష్టి, నైపుణ్యాభివృద్ధి, నీటి భద్రతపై ఫోకస్ పెట్టామని చెప్పారు. గంగా–కావేరి నదులను అనుసంధానిస్తే నీటి భద్రత సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. దేశంలో నాణ్యత పెంపుదలతో పాటు గ్లోబల్ బ్రాండ్లు ఎదగాల్సిన అవసరాన్ని ముఖ్యమంత్రి ఎత్తిచూపారు. సర్క్యులర్ ఎకానమీ, నెట్ జీరో లక్ష్యాల సాధన కోసం స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్ర వంటి కార్యక్రమాలను సమర్థంగా వినియోగిస్తున్నామని తెలిపారు.

Oil purchases : అమెరికా బెదిరింపులను లెక్కచేయని భారత రిఫైనరీలు

Exit mobile version