Site icon HashtagU Telugu

AP TET 2024 : TET నోటిఫికేషన్ విడుదల

Ap Tet

Ap Tet

ఏపీలో అధికారం చేపట్టిన కూటమి సర్కార్ (TDP)..ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో ఉంది. ముందుగా మెగా DSC ఫై సంతకం చేసిన సీఎం చంద్రబాబు (Chandrababu)..ఇచ్చిన మాట ప్రకారమే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) నోటిఫికేషన్ విడుదల చేసారు. మెగా డీఎస్సీ ద్వారా 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేయనుండగా.. అభ్యర్థులు ఆన్ లైన్ వేదికగా టెట్ ఎగ్జామ్ కు అప్లై చేసుకోవాలని సూచించారు. రేపటి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. డీఎస్సీలో టెట్ మార్కులకు 20% వెయిటేజీ ఉండనుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఇప్పటికే డీఎస్సీ ద్వారా 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ లోపు మెగా డీఎస్సీకి అర్హత అయిన టెట్ పరీక్షను మరోసారి నిర్వహించడం ద్వారా ఇంకా ఎవరైనా రాయాలనుకుంటే రాసే వీలును ప్రభుత్వం కల్పించింది. ఎట్టి పరిస్ధితుల్లోనూ డిసెంబర్ 10లోగా మెగా డీఎస్సీ ప్రక్రియ పూర్తి చేస్తామని ప్రభుత్వం తెలిపింది. అలాగే ప్రతీ జిల్లాలో 80 శాతం పోస్టుల్ని స్థానికులకు ఇచ్చేలా, మరో 20 శాతం నాన్ లోకల్ అభ్యర్ధులకు కేటాయించేలా ఈసారి నోటిఫికేషన్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. టెట్ పూర్తి వివరాల కోసం https:// aptet.apcfss.inలో చూసుకోవచ్చు.

Read Also : Babli Barrage : బాబ్లీ గేట్లు ఎత్తివేత..