AP SSC Hall Tickets 2024: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10వ తరగతి హాల్‌టికెట్లను విడుదల చేసింది. అధికారిక https://www.bse.ap.gov.in/ వెబ్‌సైట్‌లో విద్యార్థుల హాల్ టికెట్లను అందుబాటులో ఉంచింది. ప్రైవేట్ మరియు రెగ్యులర్ విద్యార్థులకు హాల్ టికెట్లను విడుదల చేస్తున్నట్లు ఏపీ విద్యాశాఖ తెలిపింది.
కాగా ఈనెల 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఏపీలో 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే ఎస్‌ఎస్‌సీ బోర్డు పరీక్షల షెడ్యూల్ కూడా విడుదల చేసింది. ఈ ఏడాది 6 లక్షల మంది 10వ తరగతి పరీక్షలు రాయనున్నారు. ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.45 వరకు నిర్వహిస్తారు.
హాల్ టికెట్లు పొందాలి అంటే డైరెక్టరేట్ ఆంధ్రప్రదేశ్ అధికారిక వెబ్‌సైట్ https://www.bse.ap.gov.in/ సైట్ ని సందర్శించండి. హోమ్‌పేజీలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టిక్కెట్‌లు అని ఉన్న లింక్ క్లిక్ చేయాలి. దాంతో కొత్త వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది. హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఇచ్చిన ఆప్షన్‌పై క్లిక్ చేయండి. జిల్లా పేరు, పాఠశాల పేరు, విద్యార్థి పేరు మరియు పుట్టిన తేదీ వంటి వివరాలను నమోదు చేసి హాల్ టికెట్ ని డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
Also Read: Top 10 AI Tools : తప్పకుండా వాడాల్సిన టాప్ – 10 ‘ఏఐ టూల్స్’