AP Scam : రూ. 20వేల కోట్ల ‘లేపాక్షి’ని లేపేస్తున్నారోచ్!?

ఏపీ రాష్ట్రంలో మ‌రో కుంభ‌కోణం(AP Scam) వెలుగు చూస్తోంది. కేవ‌లం 500 కోట్ల‌తో 20వేల కోట్ల‌ను కొట్టేసే స్కెచ్ సిద్ధ‌మ‌వుతోంది.

  • Written By:
  • Updated On - May 4, 2023 / 12:19 PM IST

ఏపీ రాష్ట్రంలో మ‌రో కుంభ‌కోణం(AP Scam) వెలుగు చూస్తోంది. కేవ‌లం 500 కోట్ల‌తో 20వేల కోట్ల‌ను కొట్టేసే స్కెచ్ సిద్ధ‌మ‌వుతోంది. ఆ విష‌యాన్ని టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబునాయుడు(Chandrababu) గ్ర‌హించారు. ఇప్పుడు ఆ డీల్ ను అడ్డుకోక‌పోతే, రాబోవు రోజుల్లో వాన్ పిక్ భూముల‌ను కూడా మింగేస్తార‌ని ప్ర‌జ‌ల్ని అప్ర‌మ‌త్తం చేశారు. ఇంత‌కూ 500కోట్లు పెడితే, 20వేల కోట్లను కొట్టేయాల‌ని ఎలా ప్లాన్ చేస్తున్నారో తెలుసా? వెరీ సింపుల్ . అనంత‌పురం లేపాక్షి నాలెడ్జ్ హ‌బ్ సెజ్ లో ఏమి జ‌రుగుతుందో తెలుసుకుంటే 20వేల కోట్లను కొట్టేయ‌డం ఇంత ఈజీనా అంటారు మీరే.

ఏపీ లో మ‌రో కుంభ‌కోణం(AP Scam)

స్వ‌ర్గీయ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి (Rejasekhar Reddy) సీఎంగా ఉన్న 2004-2009 మ‌ధ్య కాలంలో అనంత‌పురం జిల్లా చిల‌మ‌త్తూరులో లేపాక్షి నాలెడ్జ్ హ‌బ్ కోసం సుమారు 8844 ఎక‌రాల‌ను సేక‌రించారు. అప్పట్లో రైతుల‌కు ఎక‌రాకు కేవ‌లం రూ. 50వేలు ప‌రిహారం ఇవ్వ‌డం ద్వారా ఆ భూముల‌ను సేక‌రించారు. ఆ భూముల‌ను  ఇందు ప్రాజెక్టుకు (Indu project)అప్ప‌గించారు. ఆ కంపెనీతో చేసుకున్న ఒప్పందం ప్ర‌కారం టెక్నాల‌జీ పార్క్, ఐటీ కంపెనీలు, లాజిస్టిక్ , ఏవియేష‌న్, ఏరోస్పేస్, ఎక‌నామిక్ జోన్ త‌దిత‌రాల‌ను ఏర్పాటు చేయాలి. అందుకోసం ఆ భూముల‌ను బ్యాంకుల్లో పెట్టి సుమారు 4వేల కోట్ల‌ను తీసుకున్నారు. ఆ మొత్తం 2019 మార్చి నెల నాటికి 4వేలా 531 కోట్లు అయింది. ఆ మొత్తాన్ని చెల్లించాల్సిన హిందూ ప్రాజెక్టు దివాలా తీసింది.

లేపాక్షి నాలెడ్జ్ హబ్‌కు

ఇందు ప్రాజెక్టు (Indu project) తీసుకున్న రుణాల‌ను చెల్లించ‌క‌పోవ‌డంతో కేసు హైద‌రాబాద్ లోని నేష‌న‌ల్ కంపెనీ లా ట్రిబ్యున‌ల్ (ఎన్ సీఎల్ టీ) కు చేరింది. ఆ భూముల‌ను వేలం వేయాల‌ని నిర్థారించింది. దీంతో వేలం వేయ‌గా హ‌రిత ఫ‌ర్టిలైజ‌ర్స్ లిమిటెడ్ అత్య‌ధికంగా రూ. 500కోట్ల‌కు బిడ్ వేసింది. ఆ మొత్తాన్ని స‌కాలంలో చెల్లించ‌క‌పోవడంతో మ‌రోసారి నేష‌న‌ల్ కంపెనీల ట్రిబ్యున‌ల్ మ‌రోసారి వేలానికి ఉత్త‌ర్వులు జారీ చేసింది. భూమి విలువను తిరిగి అంచనా వేసి కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియను మళ్లీ ప్రారంభించాలని ఆదేశించింది. స‌రిగ్గా ఇక్క‌డే జ‌గ‌న్ అండ్ టీమ్ రూ. 20వేల కోట్ల‌ను కొట్టేయానికి ప్లాన్ చేసింద‌ని టీడీపీ(Chandrababu) ఆరోపిస్తోంది.

ఎర్తిన్ ప్రాజెక్టుకు రూ. 500కోట్ల‌కు ఇవ్వ‌డానికి రంగం సిద్ధ‌మ‌యింద‌ని

లేపాక్షి నాలెడ్జ్ హబ్‌కు బెంగళూరు విమానాశ్రయానికి కేవలం 75 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆంధ్రా-కర్ణాటక సరిహద్దులోని జాతీయ రహదారి-44లో ఉన్నందున ఈ స్థలంలో పారిశ్రామిక కేంద్రం ఏర్పాటుకు అనువుగా ఉంది. అయిన‌ప్ప‌టికీ దాన్ని వ‌దులుకోవ‌డానికి ఏపీ ప్ర‌భుత్వం సిద్ద‌మ‌యింది. ప్ర‌స్తుతం ఉన్న మార్కెట్ విలువ ప్ర‌కారం ఎక‌రం రూ. 3కోట్లు ఉంద‌ని స్థానికులు చెబుతున్నారు. అంటే, సుమారు రూ. 20వేల కోట్ల రూపాయ‌ల విలువైన భూమి అది. దాన్ని ఇప్పుడు ఎర్తిన్ ప్రాజెక్టుకు రూ. 500కోట్ల‌కు ఇవ్వ‌డానికి రంగం సిద్ధ‌మ‌యింద‌ని తెలుస్తోంది. ఎర్తిన్ ప్రాజెక్టు డైరెక్ర్ గా ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jaganmohan Reddy) మేన‌మామ ర‌వీంద్ర‌నాథ్ రెడ్డి కుమారుడు న‌రేన్ రెడ్డి ఉన్నార‌ని టీడీపీ చెబుతోంది. ఎర్తిన్ కంపెనీ ద్వారా రూ. 500 కోట్లు చెల్లించ‌డం ద్వారా లేపాక్షి హ‌బ్ (Lapakshi Hub)భూములు 8844 ఎక‌రాల‌ను కొట్టేయాల‌ని జ‌గ‌న్ అంట్ టీమ్ స్కెచ్ వేసింద‌ని ప్ర‌తి వేదిక‌పైన చంద్ర‌బాబు(Chandrababu) చెబుతున్నారు.

Also Read : Operation Balineni: CBN, PK భేటీ వెనుక ఆపరేషన్ ‘బాలినేని’..?

ప్ర‌స్తుతం లేపాక్షి హ‌బ్ (Lepaksh Hub)భూముల‌కు ఎస‌రు పెట్టిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రాబోవు రోజుల్లో వాన్ పిక్ భూముల‌ను కూడా దోచుకుంటార‌ని చంద్ర‌బాబు (Chandrababu) హెచ్చ‌రిస్తున్నారు. సుమారు 30వేల ఎక‌రాల వాన్ పిక్ భూములు ప్ర‌భుత్వం ఆధీనంలో ఉన్నాయి. అప్ప‌ట్లో ఎక‌రం రూ. 50 నుంచి రూ. 3ల‌క్ష‌ల వ‌ర‌కు రైతుల‌కు చెల్లించ‌డం ద్వారా వాటిని సేక‌రించారు. ఆ త‌రువాత వాన్ పిక్ లోని అక్ర‌మాల‌ను బ‌య‌ట‌ప‌డ‌డంతో కొంద‌రు ఐఏఎస్ లు కూడా జైలుకు వెళ్లారు. దీంతో ఆ ప్రాజెక్టు మూల‌న‌ప‌డింది. ఆ భూముల‌ను ప్ర‌భుత్వం స్వాధీనం చేసుకోవాల‌ని టీడీపీ ఉద్య‌మించింది. ఫ‌లితంగా ఆనాడున్న కిర‌ణ్ కుమార్ స‌ర్కార్ వాన్ పిక్ భూముల‌ను ప్ర‌భుత్వం స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు ఆ భూములను కూడా లేపాక్షి హ‌బ్ భూముల‌ను కొట్టేసిన‌ట్టుగా ఆదానీ గ్రూప్ ద్వారా కొట్టేయాల‌ని జ‌గ‌న్ అంట్ టీమ్ చూస్తోంద‌ని టీడీపీ ఆరోపిస్తోంది.

Also Read : TDP : రజనీకాంత్ పై వైసీపీ విమర్శలకు సీఎం జగన్ క్షమాపణ చెప్పాలి – టీడీపీ అధినేత చంద్ర‌బాబు

వాస్త‌వంగా 2013 భూసేకరణ చట్టం ప్రకారం ప్ర‌భుత్వం సేక‌రించిన స‌కాలంలో ఉపయోగించకపోతే, వెనక్కి తీసుకోవాలని ఉంది. ఆ విధంగా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం వాన్ పిక్ భూమి కేటాయింపును రద్దు చేసింది. అయితే ఇందూ ప్రాజెక్ట్స్(Indu project) నుండి స్టే ఆర్డర్ పొందింది. ఆ స్టే మీద పోరాడాల్సిన ఏపీ స‌ర్కార్ వైఫ‌ల్యం చెందింది. దీంతో రూ. 20వేల కోట్లు విలువ చేసే భూమి ఇప్పుడు రూ. 500కోట్లకు కొట్టేసే ప్లాన్ స‌క్సెస్ కానుంది. ఇద‌న్న‌మాట‌, రూ 500కోట్ల‌తో రూ. 20వేల కోట్లు కొట్టేసే జ‌గ‌న్ అండ్ టీమ్ మ్యాజిక్. దీనిపై ప్ర‌జ‌లు తిర‌గ‌బ‌డాల‌ని చంద్ర‌బాబు పిలుపు ఇస్తున్నారు.