Academic Calendar 2024-25 : ఏపీలో దసరా, సంక్రాంతి సెలవులు ఎన్ని రోజులంటే..!!

ఈ విద్యా సంవత్సరంలో స్కూళ్లు 232 రోజులు పని చేయబోతున్నట్లు తెలిపారు. మొత్తం 83 సెలవులు రాబోతున్నాయి

Published By: HashtagU Telugu Desk
Ap Release Of Academic Cale

Ap Release Of Academic Cale

విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) 2024-25 అకడమిక్ క్యాలెండర్ (Academic Calendar 2024-25) విడుదల చేశారు. ఈ విద్యా సంవత్సరంలో స్కూళ్లు 232 రోజులు పని చేయనున్నాయి. మొత్తం 83 సెలవులు రాబోతున్నాయి. సోమవారం మంత్రి లోకేష్ ..ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా అకడమిక్ క్యాలెండర్ ను విడుదల చేసారు.

ఈ విద్యా సంవత్సరంలో స్కూళ్లు 232 రోజులు పని చేయబోతున్నట్లు తెలిపారు. మొత్తం 83 సెలవులు రాబోతున్నాయి. ప్రైమరీ, హై స్కూళ్లకు దసరాకు అక్టోబర్ 4 నుంచి 13 వరకు, క్రిస్మస్ కు డిసెంబర్ 25, సంక్రాంతికి 2025 జనవరి 10 నుంచి 19 వరకు సెలవులు ఇచ్చారు.

విద్యాసంవత్సరం ముఖ్య సెలవులు చూస్తే…

దసరా సెలవులు అక్టోబరు 4 నుంచి 13 వరకు ఉండనున్నాయి.
క్రిస్టియన్ మైనార్టీ విద్యాసంస్థలకు దసరా సెలవులు అక్టోబరు 11 నుంచి 13 వరకు ఉంటాయి.
అక్టోబరు 31న దీపావళి సెలవు
డిసెంబరు 25న క్రిస్మస్, క్రిస్టియన్ మైనార్టీ విద్యాసంస్థలకు క్రిస్మస్ సెలవులు డిసెంబరు 20 నుంచి 29 వరకు.
సంక్రాంతి సెలవులు వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 19 వరకు.

ఇక సమీక్ష అనంతరం మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వ విద్యాలయాలు రాజకీయాలకు అతీతంగా ఉండాలన్నది మా ప్రభుత్వ లక్ష్యమని, ఎటువంటి రాజకీయ జోక్యాన్ని అనుమతించబోమని స్పష్టం చేశారు.
స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీల పదవీకాలం జులైతో పూర్తయినందున ఆగస్టులో మేనేజ్ మెంట్ కమిటీల ఎన్నికలు పూర్తిచేయాలని అన్నారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నాణ్యత, మౌలిక సదుపాయాల మెరుగుదల పర్యవేక్షణ బాధ్యతను పేరెంట్స్ కమిటీలకు అప్పగించాలని లోకేశ్ సూచించారు. ప్రభుత్వ స్కూళ్లలో టాయ్ లెట్ల నిర్వహణ మెరుగుపర్చాలని, ఇందుకు అవసరమైన కెమికల్స్, ఉపకరణాల కొనుగోలుకు తక్షణమే టెండర్లు పిలవాలని ఆదేశించారు.

Read Also : Hyderabad Police: ఓల్డ్ సిటీలో పోలీసుల దౌర్జన్యాలపై హైకోర్టుకు వెళ్తా: అక్బరుద్దీన్ ఒవైసీ

  Last Updated: 29 Jul 2024, 10:09 PM IST