Budameru Floodwater: 21 గ్రామాల్లోకి బుడమేరు వరదనీరు, కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

Budameru Floodwater: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ నుంచి అతిభారీ వర్షాల కారణంగా కొల్లేరు పరివాహక ప్రాంతాల్లో బుడమేరు, ఇతర వాగులు పొంగిపొర్లాయి. దీంతో కృష్ణా, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లోని అన్ని ప్రాంతాలకు అధిక నీరు వచ్చి చేరింది. దీంతో లోతట్టు ప్రాంత వాసులను పునరావాస కేంద్రాలకు తరలించారు.

Published By: HashtagU Telugu Desk
Budameru River Updates

Budameru River Updates

Budameru Floodwater: బుడమేరు నీరు కొల్లేరు చెరువులోకి చేరడంతో పెదపాడు మండలంలోని పలు గ్రామాలు ముంపునకు గురయ్యాయి. పెదపాడు మండల పరిధిలోని పాత పెదపాడు గ్రామంలోని కొణికి, సత్యవోలు, నాయుడుగూడెం, వడ్డిగూడెం, గుడిపాడు గ్రామాల్లోకి బుడమేరు నీరు వచ్చి చేరింది. కొల్లేరు చెరువులోకి బుడమేరు(Budameru Floodwater) నీరు చేరడంతో పెదపాడు మండలంలోని పలు గ్రామాలు ముంపునకు గురయ్యాయని ఐజీ అశోక్‌కుమార్‌ తెలిపారు.

పెదపాడు మండలంలో రాష్ట్ర డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ సిబ్బందితో మాట్లాడిన ఐజీ.. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాస కేంద్రాలకు తరలించేలా తగు సూచనలు, సలహాలు చేశారు. పెదపాడు మండలంలో మూడు గ్రామాలు, ఏలూరు మండలంలో ఇప్పటి వరకు 18 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఐజీకి వివరించారు.(AP Rains)

ఈ సందర్భంగా ఐజి మాట్లాడుతూ.. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ నుంచి అతిభారీ వర్షాల కారణంగా కొల్లేరు పరివాహక ప్రాంతాల్లో బుడమేరు, ఇతర వాగులు పొంగిపొర్లాయని, దీంతో కృష్ణా, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లోని అన్ని ప్రాంతాలకు అధిక నీరు వచ్చి చేరిందని ఐజీ అశోక్‌కుమార్‌ తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను రెవెన్యూ సిబ్బంది సహకారంతో పునరావాస కేంద్రాలకు తరలించి ప్రజలకు అసౌకర్యం కలగకుండా కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామని అన్నారు.

Also Read: US Trip Purely Personal, DK Shivakumar: బరాక్ ఒబామా, కమలా హారిస్‌లతో డీకే శివకుమార్ భేటీ ?

  Last Updated: 09 Sep 2024, 09:47 AM IST