AP Politics : MLC ఎన్నిక‌ల్లో ఎవ‌రిదోవ‌ వాళ్ల‌దే! BJPకి JSP క‌టీఫ్,TDPకి మ‌ద్ధ‌తు?

జ‌న‌సేన‌, బీజేపీ మ‌ధ్య సంబంధం(AP Politics) తెగిపోయింది. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల వేళ జ‌న‌సేన‌తో

  • Written By:
  • Updated On - February 14, 2023 / 03:20 PM IST

జ‌న‌సేన‌, బీజేపీ మ‌ధ్య సంబంధం(AP Politics) తెగిపోయింది. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల వేళ జ‌న‌సేన‌తో ఏ మాత్రం సంబంధం లేకుండా బీజేపీ(BJP) అభ్య‌ర్థుల‌ను ప్ర‌కటించింది. ఇలాంటి ప‌రిణామం తిరుప‌తి లోక్ స‌భ ఉప ఎన్నిక‌ల సంద‌ర్భంగా చూశాం. ఆ త‌రువాత ఆత్మ‌కూరు, బ‌ద్వేల్ ఉప ఎన్నిక‌ల సంద‌ర్భంగా క‌నిపించింది. అయిన‌ప్ప‌టికీ బీజేపీ, జ‌న‌సేన పొత్తు ఉంద‌ని ఇటీవ‌ల వ‌ర‌కు ఇరు పార్టీలు చెప్పుకొచ్చాయి. కానీ, ఎమ్మెల్సీ అభ్య‌ర్థులను బీజేపీ ప్ర‌క‌టించిన త‌రువాత కూడా పొత్తు ఉంద‌ని ఆ రెండు పార్టీలు చెబితే వినే వాళ్లు చెవిలో పువ్వులు పెట్టుకున్న‌ట్టే.

జ‌న‌సేన‌, బీజేపీ మ‌ధ్య సంబంధం తెగిపోయింది..(AP Politics) 

పట్టభద్రులు, ఉపాధ్యాయ, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు మార్చి 13న (AP Politics) జ‌ర‌గనున్నాయి. ఆ మేర‌కు గ‌త వారం ఎన్నిక‌ల సంఘం షెడ్యూల్ విడుద‌ల చేసింది. ఏపీలో 3 పట్టభద్రులు, 9 స్థానిక సంస్థలు, 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వ‌హించ‌బోతున్నారు. ఆ క్ర‌మంలో ఏపీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థుల‌ను బీజేపీ ఖ‌రారు చేసింది. కడప-అనంతపురం-కర్నూలు ఎమ్మెల్సీ స్థానానికి నగరూరు రాఘవేంద్ర, ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు ఎమ్మెల్సీ స్థానానికి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి, శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం ఎమ్మెల్సీ స్థానానికి పీవీఎన్ మాధవ్ ను ప్ర‌క‌టించింది.స్థానిక సంస్థలు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు కూడా అభ్యర్థులను ఎంపిక చేసేందుకు బీజేపీ సిద్ద‌మైయింది.

Also Read : BJP Ridings: ప్రాంతీయ పార్టీలపై బీజేపీ సవారీ! కేసీఆర్ జాతీయ కుప్పిగంతులు

సాధార‌ణ ఎన్నిక‌ల‌కు సెమీ ఫైన‌ల్ గా ఈ ఎన్నిక‌ల‌ను ఏపీలోని ప్ర‌ధాన పార్టీలు (AP Politics) భావిస్తున్నాయి. అందుకే, టీడీపీ, వైసీపీ ముందుగా అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించాయి. క్షేత్ర‌స్థాయిలో నువ్వా? నేనా? అన్న‌ట్టు ప్ర‌చారం చేస్తున్నాయి. ప్ర‌ధానంగా ప‌ట్ట‌భ‌ద్రులు నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీల స‌త్తా ఏమిటో తెలియ‌నుంది. ఓట‌రు నాడి కూడా ఈ ఎన్నిక‌ల ద్వారా దాదాపుగా ప‌ట్టుకోవ‌చ్చు. ఇక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల్లోనూ ఉద్యోగుల నాడి తెలుసుకునేలా ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. పైగా రాయ‌ల‌సీమ‌, ఉత్త‌రాంధ్ర ప్రాంతాల్లో ఈ ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డం ద్వారా సెమీ ఫైన‌ల్ గా వాటిని భావించ‌డానికి అవకాశం ఉంది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఎన్నిక‌ల‌కు జ‌న‌సేన దూరంగా ఉందా? బీజేపీతో విడిపోయిన‌ట్టేనా? ఒంట‌రిగా పోటీ చేస్తుందా? టీడీపీ అభ్య‌ర్థుల‌కు మ‌ద్ధ‌తు ఇస్తుందా? అనే ప్ర‌శ్న‌ల‌కు ఆ పార్టీ నుంచి స‌మాధానం లేదు.

అభ్యర్థుల‌ను ఏక‌ప‌క్షంగా ప్ర‌క‌టించిన బీజేపీ

ఏక‌ప‌క్షంగా అభ్య‌ర్థుల‌ను బీజేపీ ప్ర‌క‌టించ‌డం ఇప్పుడు కొత్తేమీ కాదు. గ‌త ఎన్నిక‌ల్లోనూ ఇలాంటి ప‌రిణామం చోటుచేసుకుంది. కానీ, ఇప్పుడు సాధార‌ణ ఎన్నిక‌ల సీజ‌న్. ఇప్పుడు కూడా జ‌న‌సేన స‌ర్దుకుని బీజేపీతో వెళ్లేలా ప్ర‌య‌త్నం చేస్తే భారీగా న‌ష్ట‌పోయే ప్ర‌మాదం ఉంది. ప్ర‌స్తుతం ఒంట‌రిగా అభ్య‌ర్థుల‌ను రంగంలోకి దింపే సాహ‌సం జ‌న‌సేన చేయ‌దు. అలాగ‌ని, అభ్యర్థుల‌ను ఏక‌ప‌క్షంగా ప్ర‌క‌టించిన బీజేపీతో పొత్తు పెట్టుకుని క్షేత్ర‌స్థాయిలో ప్ర‌చారానికి వెళ్ల‌లేదు. ప్ర‌భుత్వ ఓటు బ్యాంకు చీలిపోకుండా చేస్తాన‌ని ప్ర‌క‌ట‌న చేసిన ప‌వ‌న్ క‌ల్యాణ్ కు తెలుగుదేశం పార్టీ అభ్య‌ర్థుల‌కు మ‌ద్ధ‌తు ఇవ్వ‌డ‌మే మిగిలి ఉంది. ఫ‌లితంగా దాదాపుగా బీజేపీతో జ‌న‌సేన క‌టీఫ్(AP Politics) చేసుకున్న‌ట్టే భావించాలి.

Also Read : Janasena : ప‌వ‌న్ CM కోసం హ‌రిరామ‌జోగయ్య `వెట‌ర‌న్` పాలిటిక్స్