లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ, ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపకులు చిరంజీవి (AP Political Zeros) ఇద్దరూ ఇంచుమించు ఒకేలా రాజకీయాలు నడిపారు. అప్పట్లో వాళ్లిద్దరి పార్టీల కారణంగా టీడీపీ ఓడిపోయిందని భావించే వాళ్లు అనేకులు. ఆ విషయాన్ని చంద్రబాబు కూడా మీడియా సమావేశంలో ఒకానొక సందర్భంలో వెల్లడించారు. ఒక వేళ 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం, లోక్ సత్తా పోటీలో లేకుంటే టీడీపీ అధికారంలోకి వచ్చి ఉండేది. అప్పుడు రాష్ట్ర విడిపోకుండా ఉండేదని కొందరి వాదన. అందుకే, వాళ్లిద్దరి రాజకీయ వాలకం కారణంగా తెలుగు సమాజం ప్రత్యేకించి ఏపీ ప్రజలు భారీగా నష్టపోయారని రాజకీయ సర్కిల్స్ లో వినిపించే మాట.
జయప్రకాష్ నారాయణ, చిరంజీవి ఒకేలా రాజకీయాలు(AP Political Zeros)
ప్రజారాజ్యం పార్టీ పెట్టిన చిరంజీవి 2000 ఎన్నికల్లో భారీగా ప్రభుత్వ వ్యతిరేక ఓటును(AP Political Zeros) చీల్చారు. ఆ ఎన్నికల్లో 18 మంది ఎమ్మెల్యేలను ఏపీలో గెలుచుకున్నారు. సీన్ కట్ చేస్తే, పట్టుమని ఏడాది కూడా పార్టీని నడపలేకపోయారు. కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి, ఎంచక్కా కేంద్ర మంత్రి పదవిని కాంగ్రెస్ నుంచి తీసుకున్నారు. ఏపీ విడిపోయే వరకు ఆ పదవిని ఎంజాయ్ చేశారు. ఆయన అభిమానులు ఇచ్చిన 18 మంది ఎమ్మెల్యేలను, ఇతర నియోజకవర్గాల్లో ఆయన పార్టీకి వేసిన ఓటర్లను కాంగ్రెస్ లో ముంచేశారు. ప్రతిఫలంగా కేంద్ర మంత్రి పదవిని తీసుకుని నిస్సింగ్గుగా 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ఏపీలో ప్రచారం చేశారు. సీన్ కట్ చేస్తే, నామరూపాల్లేకుండా కాంగ్రెస్ పార్టీకి, చిరంజీవికి బుద్ది చెప్పారు ఏపీ ఓటర్లు. ఆ దెబ్బకు సైలెంట్ గా సినిమాలు తీసుకుంటూ కాలం వెళ్లతీస్తున్నారు.
జనసేన వైపు చిరంజీవి
ప్రజారాజ్యం 2.0 తరహాలో జనసేన ఇప్పుడు స్వింగ్ లో ఉంది. ఆ పార్టీ వైపు చిరంజీవి ఇప్పుడు మొగ్గుచూపుతున్నారు. ఆనాడు యువరాజ్యం అధ్యక్షుడుగా పవన్ కల్యాన్ ఉంటే, ఇప్పుడు ఆయన పెట్టిన జనసేన పార్టీలో కీలక పదవి తీసుకోవడానికి చిరంజీవి సిద్దమైనట్టు తెలుస్తోంది. అందుకే, వాల్తేరు వీరయ్య 200 వ రోజు ఫంక్షన్లో వైసీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేక గళం వినిపించారని మెగా అభిమానుల భావన. గతంలో జగన్మోహన్ రెడ్డి పాలన మీద ప్రశంసలు కురిపించారు. సతీసమేతంగా సంక్రాంతి విందును జగన్మోహన్ రెడ్డి ఇంటిలో ఆరగించారు. ప్రత్యేక విమానంలో వెళ్లి (AP Political Zeros) మరోసారి జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు.
జయప్రకాష్ నారాయణ వైసీపీలో చేరబోతున్నారని ప్రచారం
మరోసారి టాలీవుడ్ హీరోలతో కలిసి వెళ్లి జగన్మోహన్ రెడ్డి ఎదుట చేతులు కట్టుకున్నారు. దీంతో జనసేనానితో సహా ఆ పార్టీ సైనికులు ఆగ్రహించారు. అయినప్పటికీ అల్లూరి సీతారామరాజు విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా చిరు, జగన్ కలిసి కనిపించారు. దీంతో వైసీపీలోకి చిరంజీవి వెళుతున్నారని ప్రచారం జరిగింది. తద్విరుద్ధంగా వాల్తేరు వీరయ్య సినిమా ఫంక్షన్లో జగన్మోహన్ రెడ్డి వాటకాన్ని తప్పుబట్టారు. పిచ్చుక మీద బ్రహాస్త్రం వేసినట్టు సినిమా పరిశ్రమ మీద జగన్మోహన్ రెడ్డి క్షక్ష్య కట్టారని ఆరోపించారు. అంటే, ఆయన జనసేన వైపు మొగ్గుచూపుతున్నారని , ఆ పార్టీ తరపున పోటీకి సిద్దమవుతున్నారని సరికొత్త ప్రచారం మొదలైయింది.
Also Read : Chandrababu: సీమ సాగునీటి ప్రాజెక్టులపై CBN ప్రజెంటేషన్
ఇక ఆప్కాబ్ వజ్రోత్సవాల సందర్భంగా జయప్రకాష్ నారాయణ, జగన్మోహన్ రెడ్డి ఒకే వేదిక మీద మెరిశారు. ఇటీవల ఏపీ పాలన మీద ప్రశంసలు కురిపిస్తోన్న జేపీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెంతన కూర్చోవడం చర్చనీయాంశంగా మారింది. ఆయన వైసీపీలో చేరబోతున్నారని ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. ఆ పార్టీకి చెందిన కీలక లీడర్లు మాత్రం ఆ ప్రచారాన్ని ఖండిస్తున్నారు. అయితే, జయప్రకాష్ నారాయణ గతంలో కాంగ్రెస్ పార్టీ పాలనను మెచ్చుకున్నారు. ప్రధాని మన్మోహన్ సింగ్ ఉండగా, సోనియాతో భేటీ అయిన జేపీ కాంగ్రెస్లో చేరబోతున్నారని కూడా అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ, ఆయన ఇటీవల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఉమ్మడి ఏపీలో కూకట్ పల్లి ఎమ్మెల్యేగా ఒక్కసారి మాత్రమే గెలిచారు. ఆ తరువాత ఆయన్ను ఓడించారు. సమకాలీన రాజకీయాలు, పరిణామాల మీద మాట్లాడుతున్నారు. ఇటీవల వైసీపీకి అనుకూలంగా పలు సందర్బాల్లో మాట్లాడారు. దీంతో ఆయన ఆ పార్టీలోకి వెళ్లడానికి అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే.!
Also Read : YCP Policing : పుంగనూరులో తప్పంతా టీడీపీదేనట.!