ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల ఈ రోజు బాధ్యతలు చేపట్టనున్నారు. ఇడుపులపాయ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు ప్రత్యేక విమానంలో ఆమె చేరుకున్నారు. గన్నవరం నుంచి భారీ ర్యాలీతో ఆమె విజయవాడ నగరానకి చేరుకున్నారు. అయితే ర్యాలీలో భారీగా కార్లు ఉండటంతో పోలీసులు వాహన శ్రేణిన ఆపేశారు. దీంతో మాజీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, ఉపాధ్యక్షురాలు సుంకర పద్మశ్రీలు.. కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసిన రోడ్డుపైనే బైఠాయించారు. షర్మిల కాన్వాయ్‌లోనే ఉండి ఆమె కూడా నిరసన తెలుపుతున్నారు. ఏపీ పోలీసులు నిరంకుశత్వంగా వ్యవహరిస్తున్నారని..కావాలనే తమ ర్యాలీని డైవర్ట్ చేస్తున్నారనని మండిపడ్డారు. తమ ర్యాలీని చూసి ఏపీ ప్రభుత్వానికి భయమేస్తుందా అని ప్రశ్నించారు. షర్మిల ప్రమాణస్వీకారం సందర్భంగా విజయవాడ నగర కాంగ్రెస్ నేతలు ముందుగానే పోలీస్ కమిషనర్ అనుమతి తీసుకున్నామని తెలిపారు. ఎయిర్‌పోర్టు నుంచి ఆహ్వానం కళ్యాణమండపం వరకు ర్యాలీ ఉంటుందని అనుమతి పత్రాల్లో పేర్కొన్నామని తెలిపారు. అయినప్పటికీ పోలీసులు కావాలని తమ ర్యాలీని అడ్డుకుని వాహనాలను దారిమళ్లీస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. షర్మిల వెంట భారీగా కాంగ్రెస్ కార్యకర్తలు తరలివచ్చారు.
Also Read: Andhra Pradesh : అంగన్‌వాడీల తొలగింపునకు ప్రభుత్వం సన్నాహాలు.. కలెక్టర్లకు ఆదేశాలు జారీ ..?