Site icon HashtagU Telugu

AP New CS: ఏపీ సీఎస్‎గా విజయానంద్ నియామకం!

AP New CS

AP New CS

AP New CS: ఏపీ నూత‌న సీఎస్‌గా (AP New CS) విజ‌యానంద్ పేరు ఖ‌రారైంది. ఈ మేర‌కు ఏపీ ప్ర‌భుత్వం తాజాగా ఉత్త‌ర్వులు జారీ చేసింది. సీఎస్‌గా విజ‌యానంద్ డిసెంబ‌ర్ 31 తేదీన బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు. ఈ విష‌యాన్ని ప్ర‌భుత్వం త‌న ఉత్త‌ర్వుల్లో పేర్కొంది. ఇక‌పోతే విజ‌యానంద్ ప‌ద‌వీ కాలం 2025 న‌వంబ‌ర్ వ‌ర‌కు ఉండ‌నుంది. ప్ర‌స్తుతం సీఎస్‌గా ఉన్న నీర‌భ్ కుమార్ ఈనెల 31వ తేదీన ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్నారు.

Also Read: Shreyas Media: శ్రేయాస్ మీడియాకు మహా కుంభ మేళా ప్రకటనల హక్కులు

జూన్ 7న సీఎస్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన విష‌యం మ‌న‌కు తెలిసిందే. 1992 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి విజయానంద్ ప్రస్తుతం ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఈయన 2025 నవంబర్ నెలాఖరున పదవీ విరమణ చేయనున్నారు. విజయానంద్ 2022 నుంచి ఏపీ జెన్ కోకు ఛైర్మన్‌గా, 2023 ఏప్రిల్ నుంచి ఏపీ ట్రాన్స్ కోకు సీఎండీగా కూడా ఉన్నారు.