Site icon HashtagU Telugu

Minister Roja: ఏపీ మంత్రి రోజాకు అరుదైన అవకాశం.. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో సభ్యురాలిగా నియామకం

ROJA

Resizeimagesize (1280 X 720) 11zon

ఏపీ క్రీడా మంత్రి రోజా (Minister Roja)కు అరుదైన గుర్తింపు లభించింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI)లో సభ్యురాలిగా నియమితులయ్యారు. రోజాతో పాటు మరో నాలుగు రాష్ట్రాల క్రీడామంత్రులకు కూడా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సభ్యులుగా అవకాశం లభించింది. SAIలో రోజా సౌత్ ఇండియాకు ప్రాతినిధ్యం వహించనుంది. ఈ మేరకు కార్యదర్శి జతిన్ నర్వాల్ తెలిపారు.SAIలో సభ్యత్వంపై రోజా స్పందించారు. తనకు అరుదైన అవకాశం దక్కడం ఆనందంగా ఉందన్నారు. మెరుగైన రీతిలో సేవలు అందిస్తామన్నారు. కేంద్ర క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రి ప్రెసిడెంట్‌గా కొనసాగే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్యవర్గంలో సభ్యులుగా ఏపీ, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిస్సా, త్రిపుర రాష్ట్రాల క్రీడల శాఖ మంత్రులకు చోటు కల్పించింది కేంద్రం.

Also Read: YSRCP MLA : వైసీపీకి రాజీనామా చేసే యోచ‌న‌లో నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే..?

రోజా విషయానికి వస్తే హీరోయిన్ గా వెండితెరపై రాణించిన ఆమె..ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. రాజకీయాల్లో ఉంటూనే సినిమాల్లో, బుల్లితెరపై నటిస్తోంది. నగరి నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఏప్రిల్ 11, 2022న జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా రోజాకు మంత్రివర్గంలో అవకాశం కల్పించారు సీఎం జగన్. పర్యాటక, సాంస్కృతిక, యువజన వ్యవహారాల మంత్రిగా ఆమె ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం ఏపీ క్రీడలు, పర్యాటక శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు.