Free Bus Travel to Women : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఏపీ మంత్రి క్లారిటీ

తెలంగాణ, కర్ణాటకలో అమలవుతున్న ఈ పథకాన్ని అధ్యయనం చేస్తున్నామని..త్వరలోనే ఉచిత ప్రయాణాన్ని అమలు చేస్తామని తెలిపారు

Published By: HashtagU Telugu Desk
Free Bus To Women

Free Bus To Women

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం(Free Bus Travel to Women)పై ఏపీ మంత్రి రాంప్రసాద్‌ రెడ్డి (AP Minister Ramprasad Reddy) క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ, కర్ణాటకలో అమలవుతున్న ఈ పథకాన్ని అధ్యయనం చేస్తున్నామని..త్వరలోనే ఉచిత ప్రయాణాన్ని అమలు చేస్తామని తెలిపారు. బుధవారం కుప్పంలో కొత్తగా 5 ఆర్టీసీ బస్సు సర్వీసులను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఏపీఎస్‌ ఆర్టీసీని 100 శాతం ప్రభుత్వంలో విలీనం చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే వైసీపీ నేతలు ఆర్టీసీ స్థలాలు దోచుకున్నారన్న ఆరోపణలపై విచారణ జరుగుతుందని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురికాకుండా చూస్తామని పేర్కొన్నారు. ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని స్పష్టం చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

కుప్పం బస్టాండ్, బస్ డిపోలో ఆధునీకరణకు చర్యలు చేపడతామన్నారు. కుప్పం నుంచి అన్ని ప్రాంతాలకు బస్సు సర్వీసులు ఏర్పాటు చేస్తామని… సీఎం చంద్రబాబు కుప్పం పర్యటనకు రావడంతో సుమారు 30 బస్సులు కుప్పం డిపోకు వచ్చాయని తెలిపారు. రాజకీయ పార్టీల సభలకు ఆర్టీసీ బస్సులను ఫ్రీగా వాడబోమని మంత్రి స్పష్టం చేసారు.

Read Also : Gurukula Teachers Protest : పెద్ద‌మ్మ గుడి ముందు గురుకుల అభ్య‌ర్థుల భిక్షాట‌న‌

  Last Updated: 26 Jun 2024, 01:40 PM IST