Lokesh Vs Jagan : రూ.600 కోట్ల స్థలాలను వైసీపీ ఆఫీసులకు కట్టబెడతావా ? : లోకేష్

మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఫైర్ అయ్యారు.

  • Written By:
  • Updated On - June 23, 2024 / 01:19 PM IST

Lokesh Vs Jagan : మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ కార్యాలయాల కోసం 26 జిల్లాల్లో చేసిన భూ కేటాయింపులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు జగన్‌పై  విమర్శలు గుప్పిస్తూ  ఆయన ఓ ట్వీట్ చేశారు.

We’re now on WhatsApp. Click to Join

‘‘జగన్.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నీ తాత రాజారెడ్డి జాగీరా.. వైఎస్సార్ సీపీ ఆఫీసులు కట్టుకునేందుకు 26 జిల్లాల్లో 42 ఎకరాలను పప్పుబెల్లాల్లా కేటాయించుకున్నావు.  వెయ్యి రూపాయల నామమాత్రపు లీజు ధరకు 33 ఏళ్ల కాలానికి అంత విలువైన భూమిని కట్టబెట్టావు’’ అని నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  ‘‘వైఎస్సార్ సీపీ ఆఫీసుల కోసం నువ్వు కేటాయించుకున్న 42 ఎకరాల మార్కెట్ రేటు రూ. 600 కోట్లు. ఆ 42 ఎకరాల్లో 4200 మంది పేదలకు చెరో సెంటు స్థలం ఇవ్వొచ్చు. నీ విలాసాల ప్యాలెస్‌ల నిర్మాణానికి అయ్యే రూ. 500 కోట్లతో 25 వేల మంది పేదలకు ఇళ్లు కట్టి ఇవ్వొచ్చు జగన్. నీకు ఎందుకీ ప్యాలెస్‌ల పిచ్చి? నీ ధనదాహానికి అంతులేదా?’’ అని నారా లోకేష్(Lokesh Vs Jagan) ప్రశ్నించారు.

Also Read :Pushpak : ‘పుష్పక్’ హ్యాట్రిక్.. మూడోసారీ ప్రయోగం సక్సెస్

జగన్ హయాంలో వైజాగ్‌లోని రుషికొండ బీచ్ సమీపంలో రూ.500 కోట్లతో అత్యంత రాజభోగాలు ఉన్న ప్యాలెస్‌లను నిర్మించడాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆయన ఈ కామెంట్ చేశారు. ఆయా ప్యాలెస్‌లపై మీడియాలో వచ్చిన పలు క్లిప్పింగులను లోకేష్ షేర్ చేశారు. ప్రస్తుతం నారాలోకేష్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో మరింత హీట్ ను పెంచాయి. తాడేపల్లిలో వైఎస్సార్ సీపీ  నిర్మిస్తున్న పార్టీ ఆఫీసును ఇటీవలే సీఆర్‌డీఏ అధికారులు కూలగొట్టారు.  తాజాగా విశాఖలో వైఎస్సార్సీపీ భవనం అనుమతుల విషయంలో అధికారులు నోటీసులు జారీ చేశారు.

Also Read :Telugu Man Died : సిగరెట్ ప్యాకెట్ కోసం కాల్పులు.. అమెరికాలో తెలుగు యువకుడి మృతి

వైఎస్సార్ సీపీ పాలనలో నష్టపోయిన ఏపీని పునర్నిర్మించడంలో కీలకపాత్ర పోషించాలని తెలుగుదేశం ఎంపీలకు సీఎం చంద్రబాబు కర్తవ్యబోధ చేశారు. అమరావతి, పోలవరం సహా విభజన హామీల్ని సాధించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఎంపీ కనీసం రెండు శాఖలపై దృష్టిపెట్టి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేయాలని కోరారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా లావు శ్రీకృష్ణదేవరాయలను చంద్రబాబు నియమించారు.

Also Read :iPhone Price Cut: తక్కువ ధరకే ఐఫోన్‌.. ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్స్‌..!