AP Mega DSC: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు పాఠశాల విద్యాశాఖ కీలక అప్‌డేట్ అందించింది. ఈ నోటిఫికేషన్ ప్రారంభంలో వాయిదా వేయబడిన నేపథ్యంలో, అభ్యర్థులు నోటిఫికేషన్ విడుదలవ్వకముందు సన్నద్ధత కొనసాగించాలని పాఠశాల విద్యాశాఖ సూచించింది. ఈ క్రమంలో డీఎస్సీ సిలబస్‌ను నవంబర్ 27వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ సిలబస్‌ను ఏపీ డీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. విద్యాశాఖ డైరెక్టర్ విజయ్ రామరాజు తెలిపారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు సిలబస్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
అయితే, డీఎస్సీ నోటిఫికేషన్ కోసం మరింత ఆలస్యం జరుగనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం, సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా ఎస్సీ వర్గీకరణను అమలు చేయడంలో ఆలస్యం జరుగుతున్నందున, ఆ నిర్ణయం పూర్తయ్యాకే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి కనీసం 2-3 నెలల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. కాగా, నోటిఫికేషన్ వాయిదా పడినప్పటికీ, టీచర్ల నియామకాలు అనుకున్న సమయానికి పూర్తి చేయాలని ప్రభుత్వం ప్రకటించింది.
డీఎస్సీ నోటిఫికేషన్ సిలబస్ ముందుగా విడుదల చేయాలని మంత్రి నారా లోకేష్ ఆదేశాలు ఇచ్చారు. ఈ నిర్ణయం కేంద్రంగా ఎమ్మెల్సీలు, చిరంజీవిరావు, కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి వినతిపత్రం సమర్పించారు. దీనిపై మంత్రి సానుకూల స్పందన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా, వచ్చే ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి డీఎస్సీ నియామకాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి లోకేష్ అసెంబ్లీలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల సమస్యలు, నియమకాలు, టీచర్ల విధులపై సభలో పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు మంత్రి లోకేష్.
Read Also : Detox : తరుచూ సిక్ అవుతుంటే.. ఈ ఫుడ్స్ ట్రై చేయండి..!