Rs 400 Crore Gold Bribes: దొంగలు దోచుకునేటప్పుడు బంగారం, డబ్బుకే టాప్ ప్రయారిటీ ఇస్తారు. వాళ్లకు మిగతావన్నీ తర్వాతే. వైఎస్సార్ సీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన లిక్కర్ స్కాంలోనూ అదే రకంగా దోపిడీ తంతు నడిచిందని తాజాగా ప్రత్యేక దర్యాప్తు టీమ్ (సిట్) విచారణలో వెల్లడైంది. ఆనాటి సర్కారు పెద్దల కోసం పనిచేసిన లిక్కర్ మాఫియా.. లిక్కర్ కంపెనీల నుంచి ముడుపుల వసూలులో డబ్బుతో పాటు బంగారానికి ప్రయారిటీ ఇచ్చిందట. వైఎస్ జగన్ పాలనా కాలంలో ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ (ఏపీబీసీఎల్)కు మద్యం సప్లై చేసిన లిక్కర్ డిస్టిల్లరీలు, కంపెనీల రికార్డుల్ని తనిఖీ చేసిన సిట్ అధికారులు ఈవిషయాన్ని గుర్తించారు. సదరు లిక్కర్ డిస్టిల్లరీలు, కంపెనీలు బులియన్ వ్యాపారులు, బంగారం దుకాణాలకు కోట్లాది రూపాయల డబ్బులను పంపి.. అంత విలువ చేసే బంగారాన్ని లిక్కర్ మాఫియా సభ్యులకు ఇవ్వాలని చెప్పేవట. అప్పట్లో ఏపీకి లిక్కర్ సప్లై చేసిన కంపెనీల బ్యాంక్ స్టేట్‌మెంట్లను సిట్ అధికారులు తనిఖీ చేయగా.. దాదాపు రూ.400 కోట్ల విలువైన బంగారం(Rs 400 Crore Gold Bribes) కొనుగోలు లావాదేవీల వివరాలు దొరికాయి. ఇవన్నీ ఆయా లిక్కర్ కంపెనీల అఫీషియల్ లెక్కలే. అనధికారికంగా ఇంకా ఎక్కువ బంగారాన్నే సదరు లిక్కర్ కంపెనీలు కొనేసి.. లిక్కర్ మాఫియాకు ముడుపులుగా ఇచ్చి ఉండొచ్చని సిట్ అధికార వర్గాలు అనుమానిస్తున్నాయి.
Also Read :Raj Bhavan : తెలంగాణ రాజ్‌భవన్‌లో చోరీ.. ఏమైందంటే ?
ఆ రసీదు దొరికాక.. డొంక కదిలింది
వైఎస్సార్ సీపీ హయాంలో ఏపీలో ఊరూపేరూ లేని లిక్కర్ బ్రాండ్లను విక్రయించారు. ఆ నాసిరకం మద్యాన్ని తాగి ప్రజల ఆరోగ్యాలు దెబ్బతిన్నాయి. ఈ నాసిరకం లిక్కర్‌ను ఏపీలో అమ్మేందుకు అనుమతులు ఇచ్చినందుకు.. సదరు లిక్కర్ కంపెనీలు, డిస్టిల్లరీలు బంగారాన్ని, డబ్బులను ఆనాటి లిక్కర్ మాఫియాకు ముడుపులుగా సమర్పించుకున్నాయి. వైఎస్సార్ సీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా వాసుదేవరెడ్డి పనిచేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే ఆయన తన ఆఫీసు నుంచి కీలక ఫైళ్లను మాయం చేశారనే అభియోగాలు ఉన్నాయి. దీనిపై గతంలో వాసుదేవరెడ్డి వాహనం, సన్నిహితుల ఇళ్లలో పోలీసులు రైడ్స్ చేయగా..బంగారం కొనుగోళ్లకు సంబంధించిన రసీదులు దొరికాయి. కిలోల కొద్దీ బంగారం కొన్న రసీదులవి. అవి ఎవరివి అని ఆరాతీయగా.. ఏపీకి లిక్కర్‌ను సప్లై చేసిన డిస్టిల్లరీలవి అని తేలింది. అనంతరం అన్ని డిస్టిలరీలు, మద్యం సరఫరాదారుల రికార్డుల్ని పరిశీలించగా.. అవన్నీ భారీగా బంగారం కొన్నట్లు వెల్లడైంది. ముడుపులుగా ఇచ్చుకోవడానికే ఈ బంగారాన్ని కొన్నట్లు స్పష్టమైంది.
Also Read :Car Door Lock: విజయనగరం కారు డోర్‌లాక్ ఘటన.. మనం ఏం నేర్చుకోవాలి ?
రూ.196 కోట్ల బంగారం ఇచ్చుకున్న తిలక్‌నగర్ ఇండస్ట్రీస్
వైఎస్సార్ సీపీ హయాంలో ముంబైకి చెందిన తిలక్‌నగర్ ఇండస్ట్రీస్ మాన్షన్ హౌస్ బ్రాండీని ఏపీకి సప్లై చేసింది. ఈ కంపెనీ ఒక్కో బ్రాండీ కేస్‌కు 20 శాతం చొప్పున లిక్కర్ మాఫియాకు రూ.280 కోట్ల దాకా ముడుపులు ఇచ్చినట్లు సిట్ గుర్తించింది. ఇందులో దాదాపు రూ.196 కోట్ల ముడుపులను బంగారం రూపంలోనే ఇచ్చిందట. తిలక్‌నగర్ ఇండస్ట్రీస్ అనేది పద్మావతి జ్యూయలరీ షాప్‌తో రూ.107 కోట్లు, తాయల్ ఎంటర్‌ప్రైజెస్‌తో రూ.85 కోట్లు, సోనాచాందీ జ్యూయలర్స్‌తో రూ.3.5 కోట్లు, ఉదయ్ జ్యూయలరీ ఇండస్ట్రీస్‌తో రూ.80 లక్షల గోల్డ్ లావాదేవీలు జరిపినట్లు వెలుగులోకి వచ్చింది.