Site icon HashtagU Telugu

AP Politics: పవన్‌పై ప్రాసిక్యూట్ జీవో.. జైలుకెళ్లడానికైనా సిద్ధం

AP Politics

New Web Story Copy 2023 07 20t190722.786

AP Politics: నేను జైలుకెళ్లడానికైనా సంసిద్ధమేనని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఢిల్లీలో బీజేపీ మిత్రపక్షం సమావేశం అనంతరం ఆయన మంగళగిరి పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. అంతకుముందు విశాఖ జిల్లా వైసీపీ నేత పంచకర్ల రమేష్ బాబు జనసేనలో చేరారు. పవన్ కళ్యాణ్ జనసేన కండువా కప్పి పార్టీలోకి రమేష్ బాబును ఆహ్వానించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. జనసేనలో పంచకర్ల రమేష్ బాబుకు సముఖత స్థానం కల్పిస్తానని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ వ్యవస్థపై పవన్ కళ్యాణ్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. వాలంటీర్లు ప్రజల నుంచి 23 రకాల అంశాలపై డేటా సేకరిస్తున్నారని ఆరోపించారు. సేకరించిన ఆ డేటాని ఎం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. అయితే పవన్ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలకు గానూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పవన్ ని ప్రాసిక్యూట్ చేయాల్సిందిగా జీవో జారీ చేసింది. ప్రాసిక్యూషన్ జీవోపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. నన్ను అరెస్ట్ చేసుకుంటే చేసుకోండని ఉద్ఘాటించారు. ఆంధ్రప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం జైలుకెళ్లడానికైనా సిద్ధమేనంటూ చెప్పారు. ఎన్ని చిత్రహిసంలు పెట్టినా భరిస్తానని అన్నారు.

సీఎం జగన్ అధికారంలోకి వస్తే కొండలు అయినా తొవ్వగలడని నేను గతంలోనే చెప్పానని, నేను చెప్పినట్టే రుషి కొండల్ని తవ్వేశాడని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్. ఢిల్లీ సమావేశానికి వెళ్ళింది అప్పుల కోసమో, కేసుల మాఫీ కోసమో  కాదని, నాకు మోడీకి, అమిత్ షా అనుబంధం ప్రత్యేకమని చెప్పారు. ప్రజలందరూ కోరుకుంటే నేను సీఎం కుర్చీలో కూర్చోవడానికి రెడీగా ఉన్నానని, అయితే నేను సీఎం కావడం కంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుండడమే నా కోరిక అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

Also Read: KTR: భారీ వర్షాల ఎఫెక్ట్.. రైతు నిరసన కార్యక్రమాలు వాయిదా!