Site icon HashtagU Telugu

Results : ఈ లింక్ ద్వారా ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు చెక్ చేసుకోండి

Inter Results 2025

Inter Results 2025

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు సప్లిమెంటరీ పరీక్షల (AP Intermediate Supplementary Results) ఫలితాలను విడుదల చేసింది. ఈ ఫలితాల్లో ఫస్టియర్ (1st Year ) అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ మరియు సెకండియర్ (2nd Year) సప్లిమెంటరీ పరీక్షల వివరాలు అందించాయి. మొత్తం 1,35,826 మంది విద్యార్థులు ఫస్టియర్ పరీక్షలు రాయగా, 97,963 మంది సెకండియర్ పరీక్షలకు హాజరయ్యారు. ఈ ఫలితాలను విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ https://resultsbie.ap.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

Monkey : దీన్నే కోతి చేష్టలు అంటారు.. 20 లక్షల విలువైన బ్యాగ్ ఎత్తుకెళ్లి..

ఇంటర్ రెగ్యులర్ ఫలితాలను ఏప్రిల్‌లో విడుదల చేసిన నేపథ్యంలో, ఫస్టియర్‌లో 70% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, సెకండియర్‌లో 83% పాస్ రేటు నమోదైంది. రెండో సంవత్సరం పరీక్షలకు 2,03,904 మంది బాలురు హాజరుకాగా, 1,62,952 మంది పాసయ్యారు. అలాగే 2,18,126 మంది బాలికలలో 1,88,569 మంది ఉత్తీర్ణత సాధించారు. అబ్బాయిలు 80 శాతం పాస్ కాగా, అమ్మాయిలు 86 శాతం పాస్ అయ్యారు. ఒకేషనల్ కోర్సుల్లో కూడా బాలికలు బాలుర కంటే మెరుగైన ఫలితాలు సాధించారు.

Pahalgam Attack: పాక్‌కు మ‌రో ఎదురుదెబ్బ‌.. ఈసారి ఇంట‌ర్నేష‌న‌ల్ లెవ‌ల్‌లో!

ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో బాలికలు బాలుర కంటే మరోసారి మెరుగైన ఉత్తీర్ణత శాతం నమోదు చేశారు. 2,38,107 మంది బాలురలో 1,56,258 మంది పాస్ కాగా, బాలికల సంఖ్య 2,49,188 కాగా, వారిలో 1,86,721 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 66 శాతం పాస్ కాగా, బాలికలు 75 శాతం ఉత్తీర్ణత సాధించడం విశేషం. ఒకేషనల్ ఫస్టియర్‌లో బాలికల పాస్ శాతం 71 కాగా, బాలురలో అది కేవలం 50 శాతం మాత్రమే ఉంది. ఈ ఫలితాల ద్వారా బాలికల విద్యాప్రమాణం మెరుగవుతున్నదని స్పష్టమవుతోంది.