Vangalapudi Anitha : ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి అనిత ఇటీవల మీడియాతో మాట్లాడి రాష్ట్రంలోని వివిధ అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్, గండికోట బాలిక హత్య కేసు, గత ప్రభుత్వ విధానాలు, రాబోయే డిఫెన్స్ పరిశ్రమల ప్రాజెక్టులు వంటి పలు అంశాలపై ఆమె విస్తృతంగా స్పందించారు. హోం మంత్రి మాట్లాడుతూ, “ఒక ఎంపీని అరెస్ట్ చేయాలంటే అన్ని ఆధారాలు ఉండాలి. ఎవరినీ అక్రమంగా అరెస్ట్ చేయడం జరగదు. మేము పక్కా ఆధారాలతోనే ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశాం,” అని చెప్పారు. అక్రమ అరెస్టు అనే విమర్శలకు సమాధానంగా, “అక్రమ అరెస్ట్ అంటే అది మాజీ సీఎం చంద్రబాబుపై జరిగిన అరెస్టే అవుతుంది,” అంటూ ప్రతిపక్షంపై ఆమె విమర్శలు గుప్పించారు.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన ఫైళ్లు దహనం ఘటన, అటవీ భూముల్లో అక్రమ నిర్మాణాల కేసులపై కూడా ఆమె మాట్లాడారు. “ఈ కేసులు ఇంకా దర్యాప్తులోనే ఉన్నాయి. ఇంకా ఎలాంటి ముగింపు దశకు రాలేదు. సాక్ష్యాలు, ఆధారాలను సేకరించి పూర్తి నివేదిక ఇవ్వాల్సి ఉంది,” అని హోం మంత్రి తెలిపారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రాన్ని కుదిపేస్తున్న గండికోట బాలిక హత్య కేసుపై కూడా మంత్రి స్పందించారు. “ఈ కేసులో నిందితుడిపై రెండు రోజుల్లో పూర్తి స్పష్టత వస్తుంది. పోలీసులు ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించారు. నిజానికి దగ్గరగా విచారణ జరుగుతోంది,” అని చెప్పారు.
IND vs ENG: నాల్గవ టెస్ట్‌కు ముందు టీమిండియాకు బ్యాడ్ న్యూస్!
ప్రస్తుతం గుహ ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్‌పై వ్యాఖ్యానిస్తూ, “వారు జాబ్ క్యాలెండర్ పేరుతో సాక్షి క్యాలెండర్‌ను విడుదల చేశారు,” అని ఆమె విమర్శించారు. యువతను తప్పుదారి పట్టించే విధంగా ప్రస్తుత ప్రభుత్వం వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధి విషయానికొస్తే, “డిఫెన్స్ పరిశ్రమ త్వరలో మడకశిరలో ప్రారంభం కానుంది. ఇది రాష్ట్ర అభివృద్ధికి కొత్త ఊపును ఇస్తుంది,” అని మంత్రి అన్నారు.
“ఒక్క ఛాన్స్ అని చెప్పి రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి నెట్టిన వారు ఇప్పుడు మాకు బోధలు చెబుతున్నారు. నాడు-నేడు అనే కార్యక్రమం బాహ్యంగా పటారం లాగా కనిపించినా లోపల మాత్రం లోటారంలా ఖాళీగా ఉంది. ఆ కార్యక్రమంపై విచారణ చేస్తే అనేక అవకతవకలు బయటపడతాయి,” అని మాజీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆమె మండిపడ్డారు.
అంతేకాకుండా, ఇటీవల భార్యలు భర్తలను హత్య చేసే ఘటనలు పెరుగుతున్నాయన్న విషయంలో ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. “ఇలాంటి సంఘటనలకు టీవీ సీరియల్స్, సినిమాల ప్రభావం ఎక్కువగా ఉందని నేను భావిస్తున్నాను. సమాజంలో ఈ అంశంపై చైతన్యం అవసరం,” అని హోం మంత్రి తెలిపారు.
HHVM Press Meet : చిత్రసీమ తనకు అన్నం పెట్టిందంటూ ఎమోషనలైనా పవన్ కళ్యాణ్