Chandrababu Bail Petition: స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను (Chandrababu Bail Petition) ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అక్టోబర్ 27న విచారించనుంది. ఈ అంశాన్ని సోమవారం డివిజన్ బెంచ్‌కు పంపారు. చంద్రబాబు నాయుడు ఈ నెల మొదట్లో అక్టోబర్ 19న బెయిల్ పిటిషన్‌ను సమర్పించగా.. ఆయన ఆరోగ్య పరిస్థితిని పేర్కొంటూ బెయిల్ మంజూరు చేయాలని ఆయన న్యాయవాదులు కోర్టుకు లేఖ రాశారు. సిఐడి దర్యాప్తు చేస్తున్న స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌కు సంబంధించిన అవినీతి ఆరోపణలను ప్రస్తుతం చంద్రబాబు ఎదుర్కొంటున్నారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 19న హైకోర్టు ఈ పిటిషన్‌పై విచారణ జరిపి వెకేషన్ బెంచ్ ముందుకు వాయిదా వేసింది. చంద్రబాబుకు సంబంధించిన వైద్య నివేదికలను 27నాటి విచారణకు కోర్టు ముందు ఉంచాలని రాజమండ్రి జైలు అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే రేపు ఏపీ హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Also Read: Telangana: కేసీఆర్ హైదరాబాద్ ని లూటీ చేసిండు, కవిత అరెస్ట్ కాలేదు
మరోవైపు చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీం కోర్టు తీర్పును రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 30 తర్వాత కానీ, వచ్చే నెల 8లోపు తీర్పును వెల్లడించే అవకాశం ఉంది. అలాగే ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌పైనా వచ్చే నెల 9న సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది.
We’re now on WhatsApp. Click to Join.
క్వాష్ పిటిషన్‌పై కోర్టు తీర్పును వెల్లడిస్తే ఈ కేసులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. చంద్రబాబు అరెస్ట్ అయ్యి ఇప్పటికి 47 రోజులు అవుతున్నా ఆయన ఆరోగ్యంపై ఎలాంటి ప్రత్యేక దృష్టి పెట్టలేదని ఇటు కుటుంబ సభ్యులు.. అటు టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. చంద్రబాబు డీ హైడ్రోషన్‌కు గురికావడం, చర్మ సంబంధిత ఇబ్బందులు రావడం, బరువు తగ్గడం వంటి ఆరోగ్య సమస్యలపై ప్రభుత్వం పట్టించుకోవటంలేదని విమర్శలు కురిపిస్తున్నారు.